-Advertisement-

9 ఏళ్లయిన చెరిగిపోని సిరా గుర్తు.. ఆ.. బామ్మ ఓటు ఎలా వేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Vaasthava Nestham
పార్లమెంట్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంపీలుగా పోటీ చేసే అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారాలు చేశారు. మూడు విడతల్లో పలు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. నాలుగో(parliament elections) విడత పోలింగ్ రేపు(మే13) జరుగనున్నది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh elections 2024) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు కలిపి జరుగుతున్నాయి. ఓటు వేసే సమయంలో ఎన్నికల అధికారులు ఓటర్ల వేలిపై సిరా గుర్తు వేస్తారనే విషయం తెలిసిందే. దొంగ ఓట్లు పడకుండా ఈ సిరా గుర్తు అడ్డుకుంటుంది. ఏ ఎన్నికలైనా సరే పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ప్రతి ఓటరుకు ఈ సిరా గుర్తును వారి వేలికి వేస్తారు. అయితే ఓ మహిళకు మాత్రం ఈ సిరా గుర్తు దాదాపు 9 ఏళ్ల పాటు ఓటు వేయకుండా చేసింది. 9 ఏళ్లుగా ఆమె వేలికి ఉన్న సిరా మరక చెరిగిపోలేదు. చివరికి ఆమె ఏం చేసిందంటే..?

ఎన్నికలప్పుడు ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారా లేదా అనే విషయం వారి వేలికి ఉన్న సిరా మరకను బట్టి తెలిసిపోతుంది. ఎన్నికల పోలింగ్ రోజు ఓటు వేసేందుకు వెళ్లిన ఓటర్లకు వారి ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా మరకను వేస్తారు. ఇది కొన్ని రోజుల వరకు అలాగే ఉంటుంది. ఆ తర్వాత చెరిగిపోతుంది. కానీ ఓ మహిళకు మాత్రం ఏళ్లు గడిచినా సిరా గుర్తు పోవడం లేదు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ విషయం హాట్ టాపిక్ గామారింది. గత తొమ్మిదేళ్లుగా సిరా గుర్తు చెరిగిపోకపోవడంతో ఆమె మూడు పర్యాయాలు తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయింది. ఆమె మరెవరో కాదు కేరళకు చెందిన ఉష అనే మహిళ.

62 ఏళ్ల వయసున్న ఉష అనే మహిళ 2016లో కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కులపుల్లి ఏయూపీ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకుంది. అప్పుడు ఎన్నికల అధికారులు వేసిన సిరా గుర్తు కొన్ని రోజుల్లో పోతుందిలే అని భావించింది. కానీ నెలలు గడుస్తున్న సిరా గుర్తు చెరిగిపోలేదు. సిరా మరకను పోగొట్టుకునేందుకు శతవిదాల ప్రయత్నించింది. అయినా ఫలితం లేకపోయింది. అయితే ఆ తర్వాత కేరళలో స్థానిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన ఉషను ఓటు వేసేందుకు అధికారులు అంగీకరించలేదు. ఎందుకంటే అప్పటికే ఆమె వేలిపై సిరా గుర్తు ఉంది కాబట్టి.

కానీ అసలు విషయం చెప్పడంతో ఎన్నికల అధికారులు ఓటు వేసేందుకు అనుమతినిచ్చారు. ఏళ్లు గడుస్తున్నా సిరా గుర్తు చెరిగిపోకపోవడం, పోలింగ్ కేంద్రాల్లో పలు వివాదాలు చోటుచేసుకోవడంతో 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉష ఓటేసేందుకే వెళ్లలేదు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన డీసీసీ ప్రధాన కార్యదర్శి టీవై షిహాబుద్దీన్‌కు ఉష తన గోడు వెళ్లడించింది. దాదాపు తొమ్మిదేళ్లయినా వేలికి వేసిన సిరా గుర్తు చెరిగిపోలేదని చెప్పింది. ఈ విషయాన్ని అతను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఆమెను ఓటు వేసేందుకు అధికారులు అనుమతిచ్చారు.
Comments
 -Advertisement-