ACB ride: ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,నిర్మల్: ఏసీబీ అధికారులు ఎన్నో దాడులు నిర్వహించి లంచం తీసుకుంటుండగా అధికారులను పట్టుకున్న కూడా కొందరు అధికారులు భయం లేకుండా పోయింది అని అనడానికి ఇదే ఘటనని దర్శనం. నిర్మల్ జిల్లా భైంసాలో అవినితి అధికారి ఏసీబీకి చిక్కారు. ఓ ఇంటి నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. భైంసా మున్సిపల్ కార్యాలయంలో బుధవారం (మే 22) ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్ లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. Municipal commissioner caught by ACB
ఇంటి నిర్మాణం కోసం అనుమతులకు లంచం..
భైంసా పట్టణ పరిధిలో పురానం బజార్ కు చెందిన రాదేశం అనే వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతుల ఇచ్చేందుకు వెంకటేశ్వరు లంచం డిమాండ్ చేశారు. బాధితు డిని డబ్బులు తీసుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎవరైనా అధికారులు లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments