-Advertisement-

ADILABD: బోరజ్ చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు

Vaasthava Nestham

- ఆర్టీవో సిబ్బంది అవినీతి కార్యకలాపాలపై విచారణ.?
- పలు రికార్డులు స్వాధీనం


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: రాష్ట్రంలోనే అతిపెద్ద చెక్ పోస్ట్, జిల్లాలోని బోరజ్ గ్రామం వద్ద గల తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రికార్డులను స్వాధీనపరుచుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు జిల్లాలోని జైనథ్ మండలం బోరజ్ జాతీయ రహదారి నెంబర్ 44 పై గల చెక్ పోస్ట్'లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యశ్వంత్, ఏఎం విఐ అపర్ణ, విధులు నిర్వహిస్తుండగా అక్కడే కొందరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవడంపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. నిత్యం వేలాది వాహనాలు బోరజ్ చెక్ పోస్ట్ మీదుగా రాకపోకలు సాగిస్తుండగా భారీ వాహనాలకు సంబంధించి లైసెన్సు పర్మిట్, సరుకు రవాణా వేబిల్స్, వాహన బిల్లులు డాక్యుమెంట్ లపై ఎంత మేరకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయంపై ఆరా తీశారు. ప్రైవేటు వ్యక్తులను నియమించడంపై కేసులు కూడా నమోదు చేసినట్టు తెలిసింది. రెండు గంటలపాటు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

బోరజ్ చెక్ వద్ద భారీ ఎత్తున ప్రైవేటు వ్యక్తుల ద్వారా వాహనదారుల నుండి అక్రమ వసూళ్లు చేస్తున్నారని 'వాస్తవ నేస్తం' దినపత్రికలో గతంలో వరుస కథనాలు ప్రచురించిన విషయం పాఠకులకు వివిధమే..
Comments
 -Advertisement-