జగిత్యాలలో హైటెక్ వ్యభిచారం..
By
Vaasthava Nestham
- అమ్మాయిలు, యువతులను తీసుకొచ్చి వ్యాపారం
- ఫొటోలు స్టేటస్ పెట్టి విటులకు ఎర..?
- ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఫిక్స్
వాస్తవ నేస్తం,జగిత్యాల: డబ్బు కోసం రోజురోజుకు కొందరు మానవత విలువలను దిగజారుస్తున్నారు. ఇతర ప్రదేశాల నుండి అమ్మాయిలు మహిళలు తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దించుతున్నారు. హైటెక్ వ్యభిచారానికి జగిత్యాల పట్టణంలోని కొన్ని ప్రదేశాలు అడ్డాలుగా మారాయి. ఇతర ప్రదేశాల నుంచి అమ్మాయిలు, యువతులను తీసుకొచ్చి వ్యాపారం చేయిస్తున్నారు. పట్టణంలోని ఎస్.కే.ఎన్.ఆర్ కాలేజీ నుంచి గొల్లపల్లి వెళ్లే బైపాస్ రోడ్డులో ఓ ఇంటిని తీసుకుని, చాలా రోజులుగా వ్యభిచార వ్యవహారం నడిపిస్తున్నారు. నిర్వాహకుడు ప్రతిరోజు తన ఫోన్ లో యువతుల ఫొటోలు స్టేటస్ పెట్టుకొని విటులను ఆకర్షిస్తున్నాడు. ఆ ఫొటోలోని వారు నచ్చితే సదరు నిర్వాహకుడిని సంప్రదించేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి దందా నడిపిస్తున్నాడు. ఇతర ప్రాంతాలకు చెందిన యువతులతో పాటు జగిత్యాల చుట్టుప క్కల ఉన్న పల్లెల్లోని అమాయకపు యువతులను కూడా ఈ రొంపిలోకి దింపి, వారి భవిష్య త్తును నాశనం చేస్తున్నాడు. ఇలాంటి దందాపై గతంలో జరుగగా, పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి, నిర్వాహకులతోపాటు పలువురు యువతులను పట్టుకొని, యువతులను సఖీ కేంద్రానికి, నిర్వాహకులు, విటులను రిమాండ్‌కు తరలించారు. దాడి తెలిసి కొందరు నిర్వాహకులు పారిపోయారు. మళ్లీ ఇప్పుడు ఆ దందా కొనసాగుతున్నది. పట్టణం నడిబొడ్డున వ్యభిచార దందా జరుగుతున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. జిల్లా పోలీసులు తక్షణమే స్పందిస్తే వ్యభిచార రొంపి నుండి కొందరు మహిళలకు, యువతులకు కాపాడిన వారవుతారని, వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments