-Advertisement-

మాస్ కాపీయింగ్ కోసమే.. ఈ ప్లాన్..?

Vaasthava Nestham

- కాకతీయ యూనివర్సిటీ అధికారులనే తప్పుదోవ పట్టించారా..?
- లేదా అధికారులను మేనేజ్ చేశారా..?
- నిర్మల్ జిల్లా డిగ్రీ విద్యార్థులకు ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో పరీక్ష కేంద్రాలు
- సారంగాపూర్, దిలార్ పూర్ ప్రైవేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు బోథ్ లోని వాగ్దేవి కళాశాలలో పరీక్ష కేంద్రాలు
- దూర భారంతో విద్యార్థులకు తప్పని ఇక్కట్లు 
- మాస్ కాపీయింగ్ కోసమే ఈ ప్లాన్ అని విమర్శలు 


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: నిర్మల్ జిల్లా కేంద్రంలో తమ విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు వుంటే పాస్ పర్సంటేజీ తగ్గుతుంది అనుకున్నారో..? లేడా జిల్లా కేంద్రం అవ్వడంతో ఫ్లయిన్స్ స్కాడ్ బృందాలు తరచుగా పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తే తమ విద్యార్థులు మాస్ కాపీ చేయడానికి ఇబ్బంది అవుతుంది అని అనుకున్నారో..? లేదా ఆ కాలేజీల యజమాన్యాలు ఒకటే ఏమో..?... కానీ (Nirmal district, Saharanpur, dilwarpur) నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్, దిలార్ పూర్ ప్రైవేట్ డిగ్రీ కళాశాల (Kakatiya University degree exams) యజమాన్యాలు మంచి ప్లానే వేశారు. తమ కళాశాలల పాస్ పర్సంటేజీ పెంచుకోవడానికి ఏకంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని వాగ్దేవి (Vaghdevi degree College Boath) కళాశాలలో సెంటర్ వేయించుకోవడం ఆ కళాశాలల యజమాన్యాల తీరుపై సత్వర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు మండలాల కళాశాల విద్యార్థులకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి కానీ దానికి భిన్నంగా నిర్మల్ జిల్లా విద్యార్థులకు ఆదిలాబాద్ జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇలా సొంత జిల్లాలో కాకుండా పక్క జిల్లాలో డిగ్రీ విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంపై కాకతీయ యూనివర్సిటీ అధికారుల తీరుపై ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులను మేనేజ్ చేసుకుని మాస్ కాపీయింగ్ కోసం మారుమూల ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా చేశారని తెలుస్తోంది.

జోరుగా మాస్ కాపీంగ్...


బోథ్ మారుమూల ప్రాంతం కావడం, మాస్ కాపీయింగ్'కు(mass copying) అనుకూలంగా ఉంటుందని, తమ కళాశాల పర్సంటేజీ పాస్ పర్సంటేజీ పెంచుకోవడం కోసమే కాకతీయ యూనివర్సిటీలో తమకున్న పరిచయాలతో ఈ ప్రైవేటు డిగ్రీ కళాశాల యజమానులు చక్రం తిప్పినట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి తోడు బోథ్ కళాశాల పరిసర ప్రాంతాలలో మాస్ కాపీ చిట్టీలు పెద్ద ఎత్తున పడి ఉండడంతో మాస్ కాపీ ఫుల్లుగా జరుగుతుందని, ఇలా మాస్ కాపీంగ్ జరిగితే కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందో అని విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళన చెందుతున్నారు.
Comments
 -Advertisement-