-Advertisement-

తొలిసారి ఓటు వేస్తున్నాం.. ఓటు అమ్ముకోవడానికి సిద్ధంగా లేం..

Vaasthava Nestham

- 30 యానాది కుటుంబ ఓటర్ల ఆదర్శ నిర్ణయం
- మా ఓటు అమ్మబడదు' అని వారి గుడిసెల వద్ద ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు


వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఓటును అమ్ముకోకండి.. నిజాయితీగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. తమ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఓటు వేయండని ఎందరో సామాజిక కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్న కూడా కొందరు కొన్ని డబ్బులకు మందు బాటిల్లకు ఆశపడి ఓటును అమ్ముకుంటున్నారని ఆరోపణలు లేకపోలేదు. కొందరైతే మా గ్రామంలో, మా వార్డులో డబ్బు పంచలేదని ఆందోళనలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. కానీ ఈ ప్రజలు మేము తమ ఓటును అమ్ముకోమని, మాకు కావలసింది మా గ్రామ అభివృద్ధి అని ఎందరికో ఆదర్శంగా నిలిచారు. (Andhra Pradesh Guntur) గుంటూరు కాకుమానువారితోటకు చెందిన యానాది సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మా ఓటు అమ్మబడదు' అని వారి గుడిసెల వద్ద ఇలా ఫ్లెక్సీలు అంటించారు. (Parliament elections 2024) మురికివాడలో నివసించే 30 యానాది కుటుంబాలు చెత్త, ప్లాస్టిక్‌ కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తున్నాయి. తమకు కనీసం ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు కూడా లేక దయనీయ స్థితిలో ఉండేవాళ్లమని.. అధికారుల చుట్టూ తిరిగి ఈ ఏడాదే ఓటరు గుర్తింపు కార్డు పొందామని వారు పేర్కొన్నారు. (Andhra Pradesh parliament election) మొదటిసారిగా ఓటు వినియోగించుకునే అవకాశం వచ్చిందని, దీన్ని అమ్ముకోడానికి సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు. తమ ఓటు కొనేందుకు వచ్చిన వారికి ఇదే తెలిపామని వారు స్పష్టం చేశారు.
Comments
 -Advertisement-