-Advertisement-

డబ్బు తీసుకొని ఓటు వేసిన వారికి బుద్ధి చెప్పిన ఆ వ్యాపారి..

Vaasthava Nestham
ఓటు హక్కును వినియోగించుకోండని ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును ప్రలోభాలకు, నేతలిచ్చే డబ్బులకు అమ్ముకోవద్దని అనేక స్వచ్చంద సంస్థలు, మేధావులు, సెలబ్రిటీలు సందేశమివ్వడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

కాని ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా డబ్బులు తీసుకొని ఓటు వేసిన వారిని సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా చూసే సంప్రదాయం ఇప్పుడే మొదలైంది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మే(May) 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే ప్రతీ నియోజకవర్గంలో నేతలు, అనేక పార్టీలు ఓటర్లను తమదైన శైలీలో ఆకట్టుకునేందుకు తాయిలాలు, డబ్బులు, వస్తువులు ఇచ్చి ప్రలోభ పెట్టినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు విరుద్ధంగా కృష్ణా(Krishna) జిల్లా గుడివాడ(Gudiwada)లో ఓ వ్యాపారి డబ్బు తీసుకొని ఓటు వేసిన వాళ్లకు తన షాపులో సరుకులు(నిత్యవసరాలు) అమ్మనంటూ ఏకంగా షాపు ముందు బోర్డు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాదు ఈఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

ఓటు అమ్ముకున్న వారికి ఝలక్ ఇచ్చిన వ్యాపారి..

ఓటుతో దేశ భవిష్యత్తును మార్చుకోవచ్చు. ఐదేళ్లు ప్రజల్ని పాలించే సమర్ధవంతమైన నాయకుల్ని ఎన్నుకోవచ్చు. అలాంటి పవిత్రమైన ఓటు హక్కను నోటు కోసం అమ్ముకోవద్దని ఇప్పటికే పలువురు సందేశం ఇస్తూ వచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిసిన వేళ ఓ బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కృష్ణా జిల్లా గుడివాడలోప్రజలను ఆకర్షిస్తున్న ప్రకటన ఇది.

కష్టపడిన సొమ్ముతోనే రండి..

రాజకీయ నేతలు ఇచ్చిన సొమ్ము తీసుకొని ఓటు వేసిన ప్రజలకు తమ వద్ద వస్తువులు అమ్మబడవు అంటూ బ్యానర్లలో పేర్కొన్నాడు వ్యాపారి. కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే తమ వద్ద వస్తువులు కొనడానికి రావాలని షాపు ముందు పెట్టిన బోర్డుపై రాసి ఉంది. ఈ బ్యానర్ పై గుడివాడ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.

బుద్ధి చెప్పిన ఆ వ్యాపారి..

ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో ఓ వ్యాపారి ఏర్పాటు చేసిన బ్యానర్ ప్రజలను ఆకర్షించడమే కాకుండా ..డబ్బులు తీసుకొని ఓటు వేసిన వాళ్లను అవమానపరిచే విధంగా ఉందనే చర్చ కూడా సాగుతోంది. మరి ఈ షాపు ముందు పెట్టిన బోర్డుపై అధికారులు, నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. రాబోయే ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు ఇచ్చే సంప్రదాయానికి స్వస్తి చెబుతారని ఆశిద్దాం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వ్యాపారి చేసింది మంచి నిర్ణయం అని హర్షిస్తున్నారు.
Comments
 -Advertisement-