-Advertisement-

మైనర్ ఐన తన కూతురిపైనే తండ్రి... సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,కోరుట్ల: రోజురోజుకు మానవత్వ విలువలు మంటగలుస్తున్నాయి. కామంతో కళ్ళు మూసుకొని కొందరు వావి వరసలు మరిచి అఘాయిత్యాలకు ఓడిగడుతున్నారు. ఓ తండ్రి తన కూతురిపైనే ఆగత్యానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే ఘటన కోరుట్లలో జరిగింది. కోరుట్ల పట్టణంలో మైనర్ బాలికను రేప్ చేసిన ఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ కూతురిపై లైంగిక దాడి చేసిన కన్న తండ్రికి కోర్టు 25 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఎస్సై వెల్లడించిన వివరాల ప్రకారం.. కోరుట్ల మున్సిపల్ పరిధిలోని యెఖీన్ పూర్ గ్రామానికి చెందిన ఎల్లాల తుకారాం(40) తన మైనర్ కూతురుపైనే లైంగిక దాడి చేశాడు. ఈ కేసు విషయంలో బుధవారం జగిత్యాల జిల్లాలోని స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి నీలిమ నేరస్తునికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. అదేవిధంగా రూ.10,000 జరిమానాతో పాటు రూ‌.3 లక్షల పరిహారాన్ని కూడా బాధితురాలికి ఇవ్వాల్సిందిగా తీర్పునిచ్చారు.
Comments
 -Advertisement-