-Advertisement-

చాంప్లాతండా యువతకు క్రికెట్ కిట్ ను బహుమతిగా అందించిన డాక్టర్ పీటర్ నాయక్ లకావత్

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఖమ్మం: జిల్లాలోని కూసుమంచి మండలం, గొర్రెలపాడు తండా గ్రామపంచాయితీ పరిధిలోగల చాంప్లా తండా గ్రామానికి చెందిన డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ గత ముప్పై సంవత్సరాలనుండి దేశవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా ఆధ్యాత్మిక, సాంఘీక, సామాజిక సేవల్లో అనేకులకు అండగా నిలుస్తూ వారి వంతుగా పలురకాల సేవలు అందిస్తున్న విషయం అందరికి తెలిసినదే. ఈ నేపథ్యంలో చాంప్లా తండా యువకులు గత కొన్ని రోజులుగా వివిధ క్రీడా రంగాల్లో ఆసక్తి కలిగి ఉన్నారని తెలుసుకున్న డాక్టర్ పీటర్ నాయక్ వెంటనే స్పందించి యువతకు ఉన్నా ఆసక్తినిబట్టి చాలా రోజులనుండి వారు ఎదురు చూస్తున్న క్రికెట్ కిట్ ను అందించడానికి వారి సువిశాలమైన మనసుతో స్థానిక యువకులతో మాట్లాడి, రూ. 13,000/- విలువగల క్రికెట్ కిట్ ను పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ పేరుమీద చాం ప్లాతండా యూవకులకు అందించారు. 

ఈ క్రమములో డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ మాట్లాడుతూ.. యువత ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలకు తోడుగా ఉంటూ, ప్రతివిధమైన చెడుకు దూరంగా ఉంటూ, ప్రేమ, కనికరం, జాలీ, ఆప్యాయత, అనురాగం, సేవ గుణం కలిగి సమాజంలో పేరుకపోయిన అవినీతి, అన్యాయం, అక్రమం అనే విషబిజన్ని కూకేటి వ్రేళ్లతో తొలిగించ గలిగిన సామర్థ్యన్ని కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఉందని నేటి యువతకు ఆదర్శంగా చాంప్లా తండా యువత ఉండాలని ఆకాంక్షించారు. మరియు తమకున్న మంచి మనసును సమాజం కొరకు అంకితమై అన్ని రంగాల్లో యువత రాణించాలని పేర్కొన్నారు.

అనంతరం పలువురు యువకులు పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ లకావత్ పీటర్ నాయక్ గారు తన ఊరి యువకులకు చిరకాల అవసరతను గుర్తించి క్రికెట్ కిట్ లను మహుకరించడం చాంప్లా తండా యువకులంగా చాలా సంతోషిస్తున్నాము మరియు మా తండా వాసిగా డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ గారు సమాజానికి చేస్తున్న వివిధ సేవల్ని బట్టి గర్విస్తున్నామని స్థానిక యువకులు పేర్కొన్నారు. మరియు క్రీడారంగంలో మరియు విద్యారంగంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని డాక్టర్ పీటర్ నాయక్ సూచించారు కాబట్టి వారి సలహా సూచనల మేరకు మా వంతుగా మేము కృషి చేస్తామని యువత పెరుకుంది. ప్రోత్సాహం మాకు అందిస్తే కచ్చితంగా ముందుకు వెళ్ళగలం అని యువకులు పేర్కొన్నారు. తన ఊరికి కోసం ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని వారు పేర్కొన్నారు. పెద్దలు డాక్టర్ పీటర్ నాయక్ గారు చెప్పినట్లు చదువు ఒక్కటే కాకుండా పిల్లలకు నచ్చిన అన్ని రంగాల్లో తగిన ప్రోత్సహించ గలిగితే ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారని యూవతకులు వారి అభిప్రాయన్ని వ్యక్తం చేశారు... దీంతో గ్రామస్తులు యువకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ తో పాటు, తేజావత్ కిషన్, తేజావత్ కోటేశ్వర్ రావు, తేజావత్ వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-