-Advertisement-

యువకుడు అమ్మాయిల లాగా చాటింగ్ చేస్తూ.. నగ్న చిత్రాలు పంపుతూ.. చివరికి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఓ యువకుడు అమ్మాయిల లాగా యువకులతో చాటింగ్ చేస్తూ, నగ్న చిత్రాలు పంపుతూ, అమ్మాయిల పేరుతో యువకులను మోసగిస్తున్న యువకుడిని సైబరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని వనస్థలిపురానికి చెందిన దినేశ్ ఈజీ మనికి అలవాటు పడి బెట్టింగ్, ఆన్లైన్ గేమ్'లకు అలవాటుపడ్డాడు. ఈజీ మనీ కోసం డేటింగ్ యాప్ లలో యువతి ఫొటోలు పెట్టి అకౌంట్ తెరిచాడు. యువకులతో అమ్మాయిలా చాటింగ్ చేస్తూ, నగ్న చిత్రాలు పంపుతూ డబ్బులు వసూలు చేశాడు. మోసపోయిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు దినేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
 -Advertisement-