కోటి పనులున్నాఓటేయి ముందు..
By
Vaasthava Nestham
కోటి పనులున్నా
ఓటేయి ముందు
కోటి పనులున్నా
ఓటు తర్వాతే
అత్యవసర పరిస్థితైన
ఓటేసి వచ్చాకే
మే13 ఎన్నికల రోజు
అధికారిక సెలవు కాదు
అధికారం ఎవ్వరికి
ఇవ్వాలో నిర్ణయించే రోజు
సెలవు ఏ పార్టీకి ఇవ్వాలో
నిర్ణయించే రోజు
ప్రభుత్వాన్ని నిర్మించే
రోజు
జాతి తలరాతను
మార్చే శాశనకర్థలను
ఎన్నుకునే రోజు
ప్రజాస్వామ్య
పండుగ రోజు
ఐదు నిమిషాలు
ఆలోచించి
వరుసలో నిలబడు
ఐదేళ్ల భవిష్యత్తుకు
ఓటెయి
ఓటుతో ప్రశ్నించు
సుపరిపాలనను
శాశించు
పనులను వాయిదా
వేయి
పర్యటనలు వద్దు
పొద్దున్నే ఓటెయడం
ముద్దు
చూపుడు వేలికి
సిరా చుక్కే హద్దు
నిర్లక్ష్యం వీడాలి
మద్యం మత్తులో
ఒటేయడం మరువకు
ఓటరు కార్డు
ఆధార్ కార్డ్
పాన్ కార్డ్
బ్యాంకు పాస్ బుక్
జేబులో పెట్టుకో
పోలింగ్ బూతుకు
వెళ్ళి ఒటేయి
ఓటుకు దూరం కాకు
మనం ఓటేయక పోయిన
ఎవరో గెలుస్తారు
మనం ఓడిపోతాం
బద్ధకం వదులుదాం
బాధ్యతగా ఓటేధ్ధాం
పల్లె బతుకులు
బాగుపడాలంటే
బాధ్యతగా ఓటెయ్యాలి
ఓటు రాజ్యాంగం ఇచ్చిన
వరం
ఓటు వజ్రాయుధం
సమర్థులను ఎన్నుకుందాం
ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం
- నేదునూరి కనకయ్య
- అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం
- సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక కరీంనగర్ 9440245771
Comments