-Advertisement-

లైంగిక వేధింపుల కేసులో డీఎంహెచ్ అరెస్ట్

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,కామారెడ్డి: మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. మహిళను లైంగికంగా వేధించిన ఓ జిల్లా అధికారి కటకటాల పాలయ్యాడు. ఓ డీఎంహెచ్ ఓ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడం వినడానికి చాలా విచిత్రంగా ఉంది. ప్రాణాలు కాపాడే డాక్టర్ ఇలా వ్యవహరిస్తే.. మన సమాజం ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. వివరాల్లోకి వెళ్లితే.. కామారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ గా పని చేసే లక్ష్మణ్ సింగ్ ని లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. పలువురు వైద్యాధికారిణులు వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏడు కేసులు నమోదు అయ్యాయి. విచారణ అనంతరం ఆయనను తాజాగా అరెస్టు చేశారు పోలీసులు. డీఎంహెచ్ఓ కోర్టులో హాజరుపరచగా.. ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. లక్ష్మణ్ సింగ్ తమను ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు వైద్యాధికారిణులు ఆరోపించిన విషయం తెలిసిందే. వారి ఫిర్యాదు మేరకు లక్ష్మణ్ సింగ్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు పలు కేసులు నమోదు చేసారు. 
Comments
 -Advertisement-