-Advertisement-

Elections Ink: ఎన్నికల సిరా తయారయ్యేది ఎక్కడంటే..

Vaasthava Nestham

- దాదాపు 100 దేశాలుకు ఎన్నికల సిరాను ఎగుమతి చేసేది హైదరాబాదే..!


ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని ఎందరో కవులు సూక్తించారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యంలో రక్షించాలని ఎందరో గొప్ప వ్యక్తులు లిఖించారు. ఓటు మాత్రమే కాదు ఎన్నికల్లో సిరా చుక్కది కూడా కీలక పాత్రే. మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా సిరా చుక్కే (Elections Ink) అందుకే, భారత్'తో పాటు చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. అలాంటి సిరాని మన హైదరబాద్ లోను తయారు చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం నిబంధన 37 ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పెడ్తారు. ఈ సిరా చుక్క వేసే పద్ధతిని ఎన్నికల సంఘం 1962లో ప్రవేశపెట్టింది. దీనిని భారత ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేస్తుంది. ఎన్నికల సమయంలో వాడే సిరాను (Elections Ink) కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ తయారు చేసి సరఫరా చేస్తోంది. భారత్?లో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. అదే కంపెనీ నుంచి సిరా పంపిణీ చేసేవారు. అయితే ఈ సిరాని 1990 నుంచి హైదరబాద్? లోనూ తయారు చేస్తున్నారు. ఉప్పల్ లోని రాయుడు లాబరెటీస్ అనే సంస్థ లోనే.. దాదాపు 100 దేశాలుకు ఈ సిరాని ఎగుమతి చేస్తోంది రాయుడు ల్యాబరెటీస్ సంస్థ. ఆయా దేశాల్లో ఎన్నికల కోసం దాదాపు 100 దేశాలకు ఇండెలబుల్ ఇంక్'ను సరఫరా చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిథులు తెలిపుతున్నారు. భారత్'తో పాటు.. శ్రీలంక, దక్షిణాఫ్రికా, నైజీరియా, మాల్దీవులు, జాంబియా, ఇథియోపియా, ఈస్టర్ తిమోర్ తదితర దేశాలు తమ వినియోగదారులుగా ఉన్నారని చెబుతున్నారు కంపెనీ నిర్వాహకులు. ఇక ప్రస్తుతం భారత్? లోని చాలా రాష్ట్రాల్లో జరిగే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో తమ సిరానే (Elections Ink) ఉపయోగిస్తున్నారు. గత 37 ఏళ్లుగా రాయుడు ల్యాబ్స్ ఇండెలబుల్ ఇంక్?ను తయారు చేస్తోంది. మొదట్లో సిరాను చిన్న బాటిల్స్లో నింపి సరఫరా చేసేవాళ్లు. 2004 తర్వాత ఇంక్ మార్కర్.? లను తీసుకొచ్చామన్నారు. ఎలక్షన్స్ పోలింగ్ రోజుకు నెలరోజుల మందే.. ఎన్నికల కమీషన్?కి మొత్తం ఇంక్?ని సరఫరా చేస్తామన్నారు. దీంతో పాటు పల్స్ పోలియో కార్యక్రమంలో వాడే సిరాని కూడా రాయుడు ల్యాబరెటీస్ ఏ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (World health organization)కూడా ఇండెలబుల్ ఇంక్ కోసం ఈ సంస్థతో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది.
Comments
 -Advertisement-