-Advertisement-

KKR: కోల్‌కత నైట్ రైడర్స్ (Kolkata knight riders) ఫుల్ డీటెయిల్స్..

Kkr team history ipl, kolkata knight riders players, Kkr team history, Kkr team history players, Kkr team captain, kkr centuries in ipl history
Vaasthava Nestham
ఐపీఎల్ సీజన్ 17 (IPL season 17)లో ఫైనల్ మ్యాచ్లో సత్తా చాటిన కేకేఆర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కోల్‌కత నైట్ రైడర్స్ (Kolkata knight riders) ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో కోల్‌కతకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఈ జట్టు యాజమాన్యంలో ఒకడు. నటి జుహీ చావ్లా, ఆమె భర్త జే మెహతా కూడా సహ భాగస్వాములుగా ఉన్నారు. కోల్‌కత లోని ఈడెన్ గార్డెన్స్ ఈ జట్టుకు స్వంత మైదానం వుంది. ఈ జట్టు 2012 లో జరిగిన పోటీలలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది. అలాగే 2014 లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టును ఓడించి విజేతలుగా నిలిచింది.

ఈ గ్రూపుకు బాలీవుడ్ సెలెబ్రెటీలు యజమానులుగా వ్యవహరిస్తుండటం వల్ల ఈ జట్టు మీద ఆసక్తి నెలకొంది. 2011 లో మొదటి సారిగా ప్లే ఆఫ్స్ కు ఎంపికైంది. 2012 లో చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించి విజేతగా నిలిచింది. 2014 లో కింగ్స్ XI పంజాబ్ ను ఫైనల్లో ఓడించి మరోసారి విజేతగా నిలిచింది. ట్వెంటీ ట్వెంటీ ఆటల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా కోల్‌కత నైట్ రైడర్స్ రికార్డు సృష్టించింది.

ఈ జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు గౌతం గంభీర్. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ సునీల్ నరైన్. 2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న మనోజ్‌ తివారి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.

సెప్టెంబరు 2007 లో భారత క్రికెట్ బోర్డు నియంత్రణ మండలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటును ప్రకటించింది. 2008 నుంచి మొత్తం ఎనిమిది జట్ల మధ్య 20-20 ఆటల పోటీలు జరుగుతాయని ప్రకటించింది. ఈ ఎనిమిది జట్లు భారతదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల నుంది ప్రాతినిథ్యం వహిస్తాయని పేర్కొంది. ఇందులో కోల్ కత కూడా ఒకటి.


కోల్‌కత నైట్ రైడర్స్( Kolkata knight riders): 

KKR captain కెప్టెన్: శ్రేయస్ అయ్యర్
KKR coach కోచ్: చంద్రకాంత్ పండిత్

KKR team owners యజమాని: రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (55%)
మెహతా గుప్తా(45%)

జట్టు నగరం: కోల్‌కత, పశ్చిమ బెంగాల్
స్థాపితం: 2008
స్వంత మైదానం: ఈడెన్ గార్డెన్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయాలు: 3 (2012, 2014, 2024)
Comments
 -Advertisement-