-Advertisement-

KU DEGREE EXAMS: వావ్...! వాగ్దేవి..!

Vaasthava Nestham

- డిగ్రీ పరీక్ష కేంద్రాల కేటాయింపులో అంతా మాయ
- నిర్మల్ జిల్లా డిగ్రీ విద్యార్థులకు ఆదిలాబాద్ జిల్లాలో పరీక్ష కేంద్రం 
- నిర్మల్ జిల్లా సారంగాపూర్, దిలార్ పూర్ డిగ్రీ విద్యార్థులకు బోథ్ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రం
- పాస్ పర్సంటేజ్ పెంచుకోవడం కోసమే ఈ ఎత్తుగడ అని విమర్శలు
- రెండు కళాశాలల యజమాన్యాలు ఒకటయ్యాయా..? 
- లేదా ఒకటేనా..?


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: నిర్మల్ జిల్లాకు చెందిన సారంగాపూర్, దిలార్ పూర్ మండలాలలోని ప్రైవేటు డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం తమ కళాశాల విద్యార్థుల పాస్ పర్సెంటేజీ పెంచుకోవడం కోసమేనని విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాల విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఏ జిల్లా విద్యార్థులకు అదే జిల్లాకు సంబంధించి దగ్గరలో ఉన్న డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కానీ నిర్మల్ జిల్లా విద్యార్థులకు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండల కేంద్రంలో వాగ్దేవి డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడంపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్, ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల యజమాన్యాలు ఒకటేనని..? సారంగాపూర్, దిలార్ పూర్ మండలాలలోని డిగ్రీ విద్యార్థులకు బోథ్ మండల కేంద్రంలో పరీక్ష కేంద్రం కేటాయించడంతో తమ విద్యార్థులు సునయాసరంగా  పాస్ చేయించడం కోసమేనని రెండు జిల్లాలలో హాట్ టాపిక్'గా మారింది.

పూర్తి వివరాలు "వాస్తవ నేస్తం దినపత్రిక" తర్వాతి సంచికలో...


Comments
 -Advertisement-