-Advertisement-

Snake Bite: ఎన్నికల సిబ్బందికి పాము కాటు.. ఆస్పత్రికి తరలింపు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,భీంపూర్: మండలంలోని అందర్ బంద్ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది ప్రఫుల్ రెడ్డికి ఆదివారం సాయంత్రం పాము కాటేసింది. టాయిలెట్ కు వెళ్ళినప్పుడు పాము కాటేయడంతో వెంటనే భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్'లో ఆదిలాబాద్ లోని రిమ్స్ కి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. జైనథ్ మండలం ముక్తాపూర్లో ఉపాధ్యాయుడిగా ప్రాఫుల్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు.
Comments
 -Advertisement-