-Advertisement-

వాహన నంబర్ ప్లేట్లపై TG.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఇక వాహన నంబర్ ప్లేట్లపై TS కు బదులు TG కనబడుతోంది. వాహనాల నంబర్ పేటపై టీఎస్ ని టీజీగా మార్చేందుకు కేంద్రం ఓకే చెప్పింది. రాష్ట్ర కోడ్ టీజీ ఉండే విధంగా గెజిట్ నోటిఫికేషనన్ను కేంద్రంలోని ఉపరితల రవాణా శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్ స్థానంలో టీజీ ఉండే విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపింది. కేంద్రం నోటిఫికేషన్ ప్రకారం.. సీరియల్ నంబర్ 29 ఏ కింద టీఎస్ స్థానంలో టీజీగా సవరించింది. తెలంగాణలో ఇటీవల కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వాహనాలపై టీఎస్'కు బదులుగా టీజీ ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గురువారం ఈ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. దీంతో తెలంగాణలోని వాహనాలు అన్ని TG తో దర్శనమీయనున్నాయి.
Comments
 -Advertisement-