-Advertisement-

TS ICET Hall Tickets 2024 : తెలంగాణ ఐసెట్ హాల్ టికెట్లు విడుదల - డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ..

ts icet 2024 hall ticket icet.tsche.ac.in 2024 ts icet 2024 notification ts icet 2024 application fee ts icet 2024 last date to apply ap icet 2024
Vaasthava Nestham
TS ICET 2024 Hall Tickets Updates: తెలంగాణ ఐసెట్ - 2024 హాల్ టికెట్లు వచ్చేశాయ్. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

జూన్ 5, 6 తేదీల్లో ఐసెట్(తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షలు జరగనున్నాయి.

How to Download TS ICET Hall Tickets 2024 : ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Step 1 : తెలంగాణ ఐసెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://icet.tsche.ac.in/ అధికారిక వెబ్ సైట్ ను సందర్సించాలి.

Step 2 : హోమ్ పేజీలో ఉన్న టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ 2024 లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3 : ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలతో పాటు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీచేయాలి.

Step 4 : సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అడ్మిట్ కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది.

Step 5 : అడ్మిట్ కార్డులో వివరాలు చెక్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోవాలి.

Step 6 : తదుపరి అవసరాల కోసం దాని హాల్ టికెట్ హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోండి.

తెలంగాణ ఐసెట్ పరీక్షను జూన్ 5, 2024న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ నిర్వహించనున్నారు.
జూన్ 6, 2024న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సింగిల్ షిఫ్ట్ లో సెషన్-3 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష, ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ లో ఉంటాయి. ఇచ్చిన ఆప్షన్లలో అభ్యర్థి సరైన సమాధానాన్ని ఎంచుకోవాలి.
సెక్షన్ ఎ - అనలిటికల్ ఎబిలిటీ-ప్రశ్నాపత్రం ఇంగ్లిష్ & తెలుగు, ఇంగ్లీష్ & ఉర్దూ మీడియంలో ఉంటుంది.
సెక్షన్ బి - మ్యాథమెటికల్ ఎబిలిటీ - ప్రశ్నాపత్రం ఇంగ్లిష్ & తెలుగు, ఇంగ్లిష్ & ఉర్దూ మీడియంలో ఉంటుంది.
సెక్షన్-సి - కమ్యూనికేషన్ ఎబిలిటీ- ప్రశ్నపత్రం ఇంగ్లిష్ లో మాత్రమే ఉంటుంది.
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల

ఏపీ ఐసెట్ ఫలితాలు వచ్చేశాయ్. ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలను చూసుకోవచ్చు.

ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఐసెట్ పరీక్షకు మొత్తం 48,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 18,890 మంది బాలురు, 29,938 మంది బాలికలు ఉన్నారు. పరీక్షకు మొత్తం 44,446 మంది (91 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. మే 8న ఐసెట్ ప్రిలిమినరీ కీ అందుబాటులోకి వచ్చింది.

How to Check AP ICET Results 2024 - ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఐసెట్ రాసిన అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హోంపేజీలో కనిపించే AP ICET Results 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ వివరాలు నమోదు చేయాలి.
సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
Comments
 -Advertisement-