-Advertisement-

TS TET Hall Ticket 2024: మరికాసేపట్లో తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. TET Hall Tickets డౌన్‌లోడ్‌ ప్రాసెస్‌ ఇదే..

Vaasthava Nestham
tstet.cgg.gov.in Hall Ticket 2024: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2024) పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్ల విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.


Telangana TET 2024 Exam: తెలంగాణ టెట్ (TS TET 2024) పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు (TS TET Hall Ticket 2024) మరికాసేపట్లో విడుదలకానున్నాయి. TS TET 2024 Exam షెడ్యూల్‌ను ఇటీవల విద్యాశాఖవ విడుదల చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు మే 20వ తేదీ నుంచి TS TET 2024 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షలు.. జూన్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఎస్సీఈఆర్టీ అధికారులు ఈనెల 20వ తేదీ నుంచి జూన్‌ 2వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతి సీబీటీ)లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో TS TET 2024 పరీక్షలు జరుగుతాయి.


ఈ ఏడాది టెట్‌ పరీక్షకు 2.86 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 48,582 మంది సర్వీస్‌ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు. TS TET Hall Ticket 2024 డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (TS TRT 2024) రాయడానికి అర్హులు.టెట్‌ పేపర్‌-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్‌ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్‌ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. ఇక.. టెట్‌ పేపర్‌-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి.

ఇక జనరల్‌ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్‌ టీచర్లు కూడా టెట్‌ రాయొచ్చన్న విషయం తెలిసిందే.
Comments
 -Advertisement-