కూతురే కొడుకే... తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించిన తనయ
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,బెల్లంపల్లి: కూతురే కొడుకై కన్నతండ్రి కి తలకొరివి తన దహన సంస్కారాలు పెంచింది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం ఐబీ తాండూర్ కు చెందిన తాటిపాముల రవికుమార్ కు గత కొన్ని నెలలుగా కిడ్నీలు పాడయి హైదరాబాదు నిమ్స్'లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో శనివారం రోజు మృతి చెందాడు.
మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. మృతుడి అన్నయిన శాంభమూర్తి, తమ్ముడు రాంప్రసాద్ కు కొడుకులు ఉన్నా వారు తల కొరివి పెట్టడానికి ఊరి పెద్ద మనుషులు, బంధువులు పిలిచినా వారు ఒప్పుకోలేదు. దీంతో మృతుడి పెద్ద కుమార్తే కావ్య పెద్ద కుమారుడి బాధ్యతను తీసుకుని తల కొరివి పెట్టింది. కన్న కూతురే కొడుకుగా మారి తల కొరివి పెట్టడం అక్కడ ఉన్నవారిని కలిచి వేసింది.
Comments