-Advertisement-

నిషేధిత గుట్కా, పొగాకు నిలువలపై పోలీసుల దాడులు

Vaasthava Nestham

- రూ.3.15 లక్షల నిషేధిత పొగాకు స్వాధీనం
- ఇటీవల ఇచ్చోడలో పట్టుబడిన రూ. 2.80 లక్షల విలువ చేసే గుట్కా పట్టుకున్న పోలీసులు
- వరుస పోలీసుల దాడులతో గుట్కా వ్యాపారస్తుల గుండెల్లో గుబురు


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: నిషేధిత గుట్కా నిల్వలపై పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. ఇటీవల ఇచ్చోడ మండల కేంద్రంలో రెండు రూ. 2 లక్షల విలువ చేసే నిషేదిత గుట్కా నిల్వలను పట్టుకొని నిందితున్ని అరెస్టు చేశారు. ఈరోజు అర్థరాత్రి (గురువారం) జిల్లా కేంద్రంలో పోలీసులు నిషేధిత గుట్కా, పొగాకు అక్రమ నిల్వలపై పోలీసులు దాడులు నిర్వహించి రూ.3.15 లక్షల విలువైన పొగాకు నిర్వహణను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని ఆదర్శనగర్'లో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని పొగాకు మత్తు పదార్థాలను ప్రజలకు విక్రయిస్తూ అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి భారీ ఎత్తున పొగాకు సంచులను స్వాధీన పరుచుకున్నారు. దాడుల్లో పొగాకు నిల్వల కేసులో రిక్షా కాలనీకి చెందిన షేక్ అప్సర్ ను అరెస్టు చేశామని, మరో ఇద్దరు నిందితులు అక్రమ్, మన్సూర్ (బుక్తాపూర్) పరారీలో ఉన్నట్టు డీఎస్పీ జీవన్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ కేసును ఛేదించిన వారిలో రూరల్ సీఐ ఫణిధర్, ఎస్సై విష్ణువర్ధన్ ఉన్నట్టు డీఎస్పీ వివరించారు.
Comments
 -Advertisement-