-Advertisement-

ఎస్పీ గౌష్ ఆలమంటే.. అక్రమ గుట్కా వ్యాపారుల గుండెల్లో దడ

Vaasthava Nestham

- అక్రమ గుట్కా నిల్వ స్థావరాలపై పోలీసుల వరుస దాడులు
- రూ.77,60,586 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం
- ఎస్పీ గౌష్ ఆలం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అర్థరాత్రి స్పెషల్ డ్రైవ్
- నిషేధిత గుట్కా నిల్వ ఉంచిన ఐదు గోడౌన్లు సీజ్


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఎస్పీ గౌష్ ఆలం పేరు వినగానే అక్రమ గుట్కా వ్యాపార గుండెల్లో దడ పుడుతోంది. ఆదివాసి జిల్లా ఆయన ఆదిలాబాద్ జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారాన్ని అంతం అందించడం కోసం ఎస్పీ కృషి చేస్తున్నారు. నిషేధిత గుట్కా నిల్వచేసిన గోడౌన్లపై పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. ఎస్పీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో పోలీసులు శనివారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని ఐదు గోడౌన్లపై తనిఖీలు చేపట్టారు. ఓంకార్ జిన్నింగ్ మిల్ నందు నాలుగు గోడౌన్స్ లలో, చాందా వద్దగల ఒక గోడౌన్ల పై పోలీసులు దాడులు నిర్వహించి రూ.77,60,586 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కాను సీజ్ చేశారు. దాడుల్లో భాగంగా ఆదిలాబాద్ వన్ టౌన్ లోని ఓంకార్ జిన్నింగ్ నందు గల నాలుగు గోడౌన్స్ లో రూ 50,16,942/- విలువచేసి దాదాపు 20 రకాల నిషేధిత గుట్కాను పట్టుకొని నలుగురిపై కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు రూ.27,43,644/- విలువ చేసి నిషేధిత గుట్కా లభించిందని నలుగురిపై కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న నిషేధిత గుట్కా విలువ రూ.77,60,586/- లక్షల ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుల్లో సాజిదుల్లా ఖాన్, ఫసివుల్లా ఖాన్ లను అరెస్టు చేయగా అస్లాం ఖాన్, సమీ ఉల్లా ఖాన్, అర్బాజ్ అలీ లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గుట్కా వినియోగం వల్ల ప్రజలకు తీవ్ర అనారోగ్యం, దీర్ఘకాలిక రోగాల బారిన పడటం, ప్రమాదకరంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం వీటిని నిషేధించడం జరిగిందని తెలిపారు. లభించిన నిషేధిత గుట్కా రకాలు అనర్, ఎస్ ఆర్ వన్, ఎక్సెల్ వన్, షార్ట్ 999, ఆర్ 50, జెడ్ ఎల్, సితార గుట్కా, మాణిక్చంద్, హెచ్ ఫైవ్, స్వాగత్ లాంటి పేర్లతో ఉండటం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిషేధిత గుట్కాను అమ్మనా, రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుట్కాను జిల్లా వ్యాప్తంగా రూపుమాపాలనే ఉద్దేశంతో ప్రత్యేక సిబ్బందిని నియమిస్తూ నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తూ విధులను నిర్వర్తించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గుట్కా విక్రయదారులు నిషేధిత గుట్కాను విక్రయించడం మానుకోవాలని సూచించారు.
Comments
 -Advertisement-