-Advertisement-

నకిలీ విత్తనాల కేసులో నిందితులకు బెయిల్ రద్దు చేసిన కోర్టు

Vaasthava Nestham

- జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
- వివరాలు వెల్లడించిన డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: విత్తనాల కొరత సృష్టించి రైతులను దోచుకున్న సామ అశోక్ రెడ్డి, రాజేందర్ ల బెయిల్ పిటిషన్ ను డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఈరోజు (సోమవారం) వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గత నెల 25న ఆదిలాబాద్ పట్టణం నందు పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల తయారు కేంద్రాన్ని నెలకొల్పి, రైతులను మోసగించే ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో నిందితుల వద్ద నుండి దాదాపు 500 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నిందితులకు బెల్ లభించడంతో, జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు జిల్లా సెషన్స్ కోర్టు నందు రివిజన్ ఫైల్ చేయగా, వాదనలు విన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు గారు బెయిల్ ను రద్దుచేసి మూడు రోజుల్లోగా లొంగిపోవాలని తెలిపినట్లు డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నిందితులు సామ అశోక్ రెడ్డి, రాజేందర్ లు మున్సిఫ్ కోర్టు నందు లొంగిపోగా, కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీని విధించడంతో పోలీసులు నిందితులను మళ్ళీ జైలుకు తరలించారు. నకిలీ విత్తనాలు ముఠా స్కామ్ ను బట్ట బయలు చేసేందుకు ప్రధాన నిందితులను 10 రోజులు కష్టడిల్లోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నేరానికి పాల్పడినటువంటి నిందితులకు ఆశ్రయమిచ్చిన షాపుల ఓనర్ కు నోటీసులు జారీ చేయడం జరిగిందని, గోడౌను సీజ్ చేయడం జరిగిందని డిఎస్పీ తెలిపారు 





Comments
 -Advertisement-