-Advertisement-

ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేపల కూరతో రూంకి రావాలి... అంటూ ఎస్సై

Vaasthava Nestham
SI Sexually Assaulted Woman: ఇదిగో.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేపల కూరతో రూంకి రావాలి, ఫిర్యాదు కోసం వచ్చిన మహిళపై ఎస్సై లైంగిక వేధింపులు. వివరాల్లోకి వెళ్తే.. ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్ గడప తొక్కిన మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ ఉదంతం మరిచిపోకముందే మరో దారుణం చోటు చేసుకుంది.

నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండలానికి చెందిన ఓ మహిళ భూమి విషయంలో జరిగిన ఘర్షణపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే శాలిగౌరారం ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ ఆమెను స్టేషన్‌కు పిలిపించారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. చేపల కూర, చికెన్ వండుకుని తేవాలి. నాకు కావల్సినప్పుడల్లా గ్రీన్ టీ చేసి పెట్టాలి. భర్తకు దూరంగా ఎందుకు ఉంటున్నావ్..?

అతనితో ఉండాలన్న కోరిక లేదా?' అని ప్రశ్నించాడని బాధిత మహిళ వాపోయారు. తనతో మంచిగా ఉంటే పూర్తి సహకారం ఉంటుందని ఎస్ఐ చెప్పినట్లు ఎస్పీ ఎదుట సదరు మహిళ బోరున విలపించారు. అతను చెప్పినట్లు చేయకపోవడంతో తన కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకొని, గొడవలు సృష్టించినట్లు ఫిర్యాదులో తెలిపారు.
Comments
 -Advertisement-