-Advertisement-

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఊరంతా ఒకటై..

Vaasthava Nestham

- రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

- బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని జాతీయ రహదారిపై గ్రామస్తుల ధర్నా 
- జాతీయ రహదారిపై స్తంభించిపోయిన ట్రాఫిక్ 
- తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు 


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: నేరడిగొండ మండలంలోని రోల్ మామడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని సంక్రాపూర్ గ్రామానికి చెందిన 
జాదవ్ రాజు కేఎన్ఆర్ సంస్థలో ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. జాతీయ రహదారి మధ్యలో నాటిన మొక్కలకు మంగళవారం నీళ్లు పడుతున్న క్రమంలో లారీ ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ రాజు అక్కడికి అక్కడే స్పాట్ డెత్ అయ్యాడు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఒకేసారి జాతీయ రహదారి పైకి చేరుకొని కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు దీనితో జాతీయ రహదారిపై నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొను గ్రామస్తులకు నచ్చజెప్పి కూడా ఫలితం లేకుండా పోయింది. చివరకు నియోజకవర్గ ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించినట్లు గ్రామస్తులు తెలిపారు.
Comments
 -Advertisement-