DSC: AP: గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ ప్రకటన రద్దు
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన డీఎస్సీ ప్రకటన రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు సిఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ పై ( Megha DSC )తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. AP DSC notification మెగా డీఎస్సీ తో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జులై 1న నోటిఫికేషన్ విడుదల చేసేందకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో టెట్ పరీక్ష రాసి అర్హత సాధించని వారు, ఈ టెట్ ( TET exam ) ప్రకటన తర్వాత బిఇడి, డిఇడి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డిఎస్‌సితోపాటు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. గత డిఎస్‌సికి దరఖాస్తు చేసుకున్నవారు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ .. కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Comments