-Advertisement-

Neradigonda: మైనర్ బాలునిపై అత్యాచారం.. నిందితునికి 20 సం. జైలు శిక్ష

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: మైనర్ బాలుడు పై హత్యాచారం చేసిన నిందితునికి 20 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నట్లు పోక్సో కోర్టు న్యాయమూర్తి శివరాం ప్రసాద్ గురువారం తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన శివరాత్రి మహేష్ అనే వ్యక్తి, తన సమీప బంధువైన ఒక బాలుడిని కిరాణా షాప్ కు వెళ్ళమని తన ఇంటికి తీసుకెళ్లాడు. చాలాసేపైన కూడా బాలుడు రాకపోవడంతో బాలుడి చెల్లె నిందితుడైన శివరాత్రి మహేష్ బాలుడి ఒంటిపైన బట్టలు లేకుండా అచేతన పరిస్థితుల్లో పడి ఉండగా, నేరస్తుడు పారిపోవడంతో పారిపోయాడు. బాలుని తల్లి ఫిర్యాదు మేరకు అప్పట్లో (2021) పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేరం రుజువు అవ్వడంతో గురువారం పోక్సో కోర్టు న్యాయమూర్తి శివరాం ప్రసాద్ నిందితునికి 20 సంవత్సరాలు జైలు శిక్ష రూపాయలు రూ.10 వేలు జరిమానా విధిస్తున్నట్లు తీర్పును వెలువరించారు.
Comments
 -Advertisement-