-Advertisement-

NIT EXAM: నీట్ రీ-ఎగ్జామ్‌కు దాదాపు సగం మంది గైర్హాజ‌రు

neet re exam 2024 neet re exam for all students neet re exam 2024 date neet nta nic in 2024 neet re exam 2024 admit card neet re exam admit card
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఢిల్లీ: నీట్ ప‌రీక్ష లో అవ‌క‌త‌వ‌క‌ల జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాల మేర‌కు గ్రేస్ మార్కులు కలిపిన విద్యార్థుల‌కు నీట్ రీ – ఎగ్జామ్ నిర్వహించారు. ఆదివారం జ‌రిగిన ఈ ప‌రీక్ష‌కు దాదాపు సగం మంది డుమ్మా కొట్టిన‌ట్లు స‌మాచారం. గ్రేస్ మార్కులు క‌లిపిన 1,563 మంది ఈ ఎగ్జామ్ నిర్వ‌హించారు. మొత్తం ఏడు సెంట‌ర్ల‌లో మ‌ళ్లీ ప‌రీక్ష నిర్వ‌హించ‌గా.. 813 మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. 750 మంది ప‌రీక్ష‌కు గైర్హాజ‌రైన‌ట్లు ఎన్‌టిఎ అధికారులు వెల్ల‌డించారు. మే 5వ తేదీన జ‌రిగిన నీట్ ఎగ్జామ్‌లో ఏకంగా 67 మందికి జాతీయ స్తాయిలో మొద‌టి ర్యాంకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై కొంద‌రు అభ్య‌ర్థులు , ప‌లు సంస్థ‌లు కోర్టును ఆశ్ర‌యించారు. అయితే ప‌రీక్ష కేంద్రాల్లో స‌మ‌యం కోల్పోయిన అభ్య‌ర్థుల‌కు గ్రేస్ మార్కులు క‌లిపామ‌ని ఎన్‌టిఎ చెప్పింది. దీంతో సుప్రీంకోర్టు గ్రేస్ మార్కులు క‌లిపిన 1563 మందిక మ‌ళ్లీ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం ప‌రీక్ష నిర్వ‌హించారు.
Comments
 -Advertisement-