Puri Jagannath Temple: పూరీ యాత్రకు 315 ప్రత్యేక రైళ్లు
Puri Jagannath temple idols story
Puri Jagannath Temple timings
Jagannath Temple Puri photos
Puri Jagannath Temple distance
Puri Jagannath Temple
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: దేశ నలుమూలల నుండి పూరి జగన్నాథుడి రథయాత్ర మహోత్సవాలకు లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భారత్ రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. జులై 6వ తేదీ నుండి 19వ తేదీ వరకు పూరీ జగన్నాథుడి రథయాత్ర మహోత్సవాలు జరగనున్నాయి. జగన్నాథుడి దర్శనానికి 315 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
జగన్నాథస్వామి, సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి మూడు వేర్వేరు రథాల్లో ఊరేగుతో చేరుకుంటారు. ఆషాడ శుక్లపక్షమి హరిశయన ఏకాదశి రోజున నిర్వహించే అపురూప ఘట్టం కోసం లక్షలాది మంది భక్తులు చేరుకుంటారు. ఆ రోజున పెద్దమొత్తంలో రైళ్లు నడపాలని అధికారులు భావిస్తున్నారు. ఒడిశాలోని అన్ని ప్రధాన పట్టాణాల మీదుగా రైళ్లు నడిచేలా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒడిశా ముఖ్యమం్రి మోహన్ చరణ్ మాఝి, డిప్యూటి సిఎం కనకవర్ధన్ సింగ్ దేవ్, ప్రభాతి పరిడలకు సమాచారమిచ్చారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుండి కొన్ని ప్రత్యేక రైళ్లు పూరీకి నడపనున్నట్లు సమాచారం.
Comments