-Advertisement-

TTWURJC: రెసిడెన్షియల్ కళాశాలో ఆత్మహత్య

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో మల్టీ పర్పస్ వర్కర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇచ్చోడ ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ( TTWURJC Telangana tribal welfare residential college) టీటీడబ్ల్యూయూఆర్జీసీ బాలుర కళాశాలలో, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీకి చెందిన కుమ్ర నాందేవ్(56) గత ఆరు సంవత్సరాల నుండి మల్టీ పర్పస్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజుల నుండి మద్యానికి బానిసై వింతగా ప్రవర్తిస్తున్నాడని, వింతగా ప్రవర్తిస్తూ జీవితం పై విరక్తి చెంది సోమవారం తెల్లవారుజామున టీటీడబ్ల్యూయూఆర్జీసీ డైనింగ్ హాలులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై తెలిపారు. మృతుని భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
 -Advertisement-