-Advertisement-

నేపాల్‌లో విమాన ప్ర‌మాదం.. 18 మంది దుర్మ‌ర‌ణం

Kathmandu plane crash 2024, Nepal plane crash cause, Nepal plane crash pilot died, Nepal plane crash Reddit
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: నేపాల్ లో ఘోర విమాన ప్ర‌మాదం జరిగింది. బుధ‌వారం నేపాల్ రాజ‌ధాని ఖాట్మాండు లోని త్రిభువ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ Tribhuvan international airport, Khatmandu విమానాశ్ర‌యంలో ఘోర విమాన ప్ర‌మాదం చోటుచేసుకుంది. 19 మందితో ప్ర‌యాణిస్తున్న విమానం క‌ప్ప‌కూలింది. శౌర్య ఎయిర‌లైన్స్‌కు చెందిన విమానం టేకాప్ అవుతున్న స‌మ‌యంలోనే విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది మ‌ర‌ణించారు. ప్ర‌మాదం స‌మ‌యంలో సిబ్బందితో స‌హా విమానంలో మొత్తం 19 మంది ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో పైల‌ట్ కు తీవ్ర గాయాలైన‌ట్లు తెలుస్తోంది. విష‌యం తెలుసుకున్న వెంట‌నే పోలీసులు, స‌హాయ‌క సిబ్బంది రంగంలోకి దిగారు. గాయ‌ప‌డిన పైల‌ట్ ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాద స‌మాయంలో భారీ ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ప్ర‌మాదానికి ముందు విమానం కూలుతున్న దృశ్యాలు వెలుగులోకి వ‌చ్చాయి. కాగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Comments
 -Advertisement-