-Advertisement-

పెన్ గంగా నదిలో యువకుడు గల్లంతు

Vaasthava Nestham
- గాలింపు చర్యలు చేపట్టిన డీడీఆర్ఎఫ్ బృందం

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: జిల్లాలోని జైనథ్ మండలం డొల్లార వద్ద పెన్ గంగా నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో సోమవారం ఉదయం గాలింపు చర్యలను చేపట్టారు. యువకుడి ఆచూకీ కోసం డీడీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. పెన్ గంగా నది వద్ద విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకుడు చాంద (టీ) కు చెందిన శివగా గుర్తించారు. గాలింపు చర్యలను ఆదిలాబాద్ జిల్లా ఎస్పి గౌస్ ఆలం పరిశీలించారు. ఎస్పీ వెంట సీఐ సాయినాథ్ ఎస్సై పురుషోత్తం ఉన్నారు.
Comments
 -Advertisement-