ఉగ్రరూపం దాల్చిన భద్రాచలం గోదావరి
By
Vaasthava Nestham
- గంటగంటకు పెరుగుతున్న వరద ఉధృతి
వాస్తవ నేస్తం,భద్రాచలం: భద్రాచలంవద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చు తోంది. ఎగువ ప్రాంతాల్లో కురు స్తున్న భారీ వర్షాల కారణంగా గంటగంటకు గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. Godavari river నదీ పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒడిశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో విస్తారంగా వర్షా లు కురుస్తున్నాయి. ప్రాణ హిత, ఇంద్రావతి, తాలి పేరు, కిన్నెరసాని, శబరి, కడెం ఉప నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆ నీరం తా గోదావరిలో చేరుతుండ టంతో వరద ఉధృతి అంత కంతకూ పెరుగుతోంది.
ఆదివారం సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగుల వద్దకు చేరుకోగా.. ఈరోజు ఉదయం 7గంటల సమయానికి గోదావరి నీటి మట్టం 46.4 అడుగులకు చేరింది. Bhadrachalam Godavari is raging భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుండటంతో ఆదివారం సాయంత్రమే మొదటి ప్రమాద హెచ్చరి కను జారీ చేశారు. ఆదివా రం రాత్రి 11గంటలకు గోదావరి నీటిమట్టం 44.8 అడుగులకు చేరింది. Bhadrachalam Godavari river
సోమవారం ఉదయం 46.4 అడుగులకు నీటిమట్టం చేరింది. 10,68,602 క్యూసె క్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 53 అడుగులకే చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇప్పటికే అలర్ట్ గా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచనలు చేశారు. Bhadrachalam Godavari river ప్రస్తుతం మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాలతోపాటు గోదా వరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా యి. ఇదే పరిస్థితి కొనసా గితే గోదావరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 50అడుగులు దాటే అవకా శాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. Bhadrachalam Godavari river ఈ మేరకు భద్రాచలం వద్ద గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments