ఆదిలాబాద్ టూ.. ఇచ్చోడ..
By
Vaasthava Nestham
- ఏజెన్సీలో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా దందా
- పాన్ మసాలా మాటున గుట్కా విక్రయాలు
- గతంలో నిషేధిత సిగరెట్లను పట్టుకున్న పోలీసులు
- కేసులు నమోదైన మారని తీరు..
- ఆదిలాబాద్ నుండి వచ్చి ఇచ్చోడలో దందా నిర్వాహన
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ప్రజల ఆరోగ్యాన్ని హరించే గుట్కా విక్రయాలను నిషేధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపగా, ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు ఇటీవల పలు దఫాలు తనిఖీలు నిర్వహించి ఒక్క కోటిపైగా నిల్వ ఉంచిన అక్రమ గుట్కా నిల్వలను పట్టుకున్నారు. కానీ ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ మండల కేంద్రమైన ఇచ్చోడలో పాన్ మసాలా మాటున గుట్కా దందా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తోంది. ఆదిలాబాద్, గుడిహత్నూర్ తదితర ప్రాంతాల నుండి వచ్చి ఇచ్చోడ మండల కేంద్రంలో పాన్ మసాలా మాటున కొందరు షాప్ లో నిషేధిత గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇటీవల పోలీసులు పట్టుకున్న కూడా సదరు షాప్ నిర్వాహకుల తీరు మారడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో ఇట్టి షాప్ నిర్వాహకులు నిషేధిత సిగరెట్లను విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్న కూడా షాప్ నిర్వాహకుల తీరు మారకపోవడంతో నిషేధిత గుట్కా, సిగరెట్ వ్యాపారంలో ఏ స్థాయిలో మార్జిన్ ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిషేధిత గుట్కాను ఇచ్చోడలో ఎక్కడ నిల్వ చేస్తున్నారు..?? మండల కేంద్రంలోని ఏ కాలనీలో నిషేధిత గుట్కా నిలువలు ఉన్నాయి..? తర్వాతి సంచికలో...
Comments