త్రిపుర విద్యాసంస్థల్లో హెచ్ఐవీ కలకలం
By
Vaasthava Nestham
• 47 మంది విద్యార్థులు మృతి
• సుమారు 828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్
• ప్రతిరోజూ 5 నుంచి 7 కొత్త కేసులు నమోదవుతున్నాయని వెల్లడి
• రాష్ట్రంలో మొత్తంగా హెచ్ఐవీతో బాధపడుతున్నవారి సంఖ్య 5,674గా ఉంది
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: త్రిపుర రాష్ట్రంలో హెచ్ఐవీ వైరస్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి కారణంగా 47 మంది విద్యార్థులు మృతి చెందారు. సుమారు 828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్ గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ( Tripura state AIDS control society ) సీనియర్ అధికారి ఒకరు తాజాగా తెలిపారు. 828 మంది హెచ్ఐవీ HIV ( Human immunodeficiency virus ) పాజిటివ్ విద్యార్థుల్లో 572 మంది బతికే ఉన్నారని పేర్కొన్నారు. ప్రతిరోజూ 5 నుంచి 7 కొత్త కేసులు నమోదవుతున్నా యని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తంగా HIV ( Human immunodeficiency virus )హెచ్ఐవీతో బాధపడుతున్నవారి సంఖ్య 5,674గా ఉందన్నారు. వీరిలో పురుషులు 4,570 మంది కాగా, మహిళలు 1,103 మంది, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నట్లు వెల్లడించారు. హెచ్ఐవీ కేసుల పెరుగుదలకు మాదకద్రవ్యాల దుర్వినియోగమే కారణమని చెప్పారు. ( Tripura state AIDS control society ) ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 220 పాఠశాలలు, 24 కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు డ్రగ్స్ ఇంజెక్షన్ తీసుకుంటున్న గుర్తించినట్లు చెప్పారు. త్రిపుర జర్నలిస్ట్ యూనియన్, వెబ్ మీడియా ఫోరమ్, టీఎస్ఏసీఎస్ ఇటీవల సంయుక్తంగా నిర్వహించిన మీడియా వర్క్షాప్లో టీఎస్ఏసీఎస్ జాయింట్ సెక్రటరీ
ప్రసంగిస్తూ.. 'ఇప్పటి వరకు 828 మంది హెచ్ఐవీ పాజిటివ్ విద్యార్థులు నమోదయ్యారు. వారిలో 572 మంది విద్యార్థులు బతికే ఉన్నారు. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం త్రిపుర వెలుపల ఉన్న ప్రసిద్ధ సంస్థలకు వలస వెళ్ళారు. ఇప్పటి వరకు 220 పాఠశాలలు, 24 కళాశాలలు, యూనివర్సిటీల్లో విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 164 ఆరోగ్య కేంద్రాల నుంచి ఈ డేటాను సేకరించాం' అని వెల్లడించారు.
Comments