-Advertisement-

ప్రైవేట్ విద్యాసంస్థలు.. వ్యాపార కేంద్రాలు

Vaasthava Nestham

- వ్యాపార సంస్థలుగా ప్రైవేట్ విద్యాసంస్థలు
- కార్పొరేట్ విద్య అంటూ ఫీజుల దోపిడీ
- రంగులు అద్ది, బొమ్మలు గీసి..
- ప్రభుత్వ గుర్తింపులు ఆ దేవుడవు..?
- ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేట్ స్కూల్ నిర్వహణ..!


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: ప్రైవేటు విద్య వ్యాపారంగా మారింది. పాడుబడ్డ భవనాలకు రంగులు అద్ది, బొమ్మలు గీసి ఫీజుల దోపిడి. ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా..? లేవా..? అన్నది ఆ దేవుడెరుగు.. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు విద్య పేరిట వ్యాపారం చేస్తున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. నర్సరీ నుంచి టెన్త్ వరకూ ఫీజుల రూపంలో లక్షలకు లక్షలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దోచేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫామ్ లు కూడా పాఠశాలల యాజమాన్యాలే విక్రయిస్తూ కాసులు చేసుకుంటున్నారు. ఏ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లోనూ క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉండరు. ఉన్నా కొద్ది మంది మాత్రమే..

పర్మిషన్ లేకుండానే ఇచ్చోడ మండల కేంద్రంలో పాఠశాల నిర్వహణ..?


ప్రభుత్వ పరిమిషన్ లేకుండానే ఇచ్చోడ మండల కేంద్రంలో ఓ పాఠశాల నిర్వహిస్తున్నారు అని చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా తెలిసి కూడా అధికారులు మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Comments
 -Advertisement-