-Advertisement-

హాస్టల్ వార్డెన్ సస్పెండ్

Vaasthava Nestham

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: హాస్టల్ వార్డెన్'ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని  ఖండాల ప్రభుత్వ గిరిజన శాటిలైట్ సెంటర్ పొతగూడ హెచ్.డబ్ల్యూ.వో జై వంత్ విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించినందుకు కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో వార్డెన్ ను సస్పెండ్ చేసినట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు.

కాగా ప్రభుత్వ అధికారులతో పాటు వసతి గృహాలు, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు, వార్డెన్లు బాధ్యతగా విధులు నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Comments
 -Advertisement-