బోథ్'లో 'పసిడి పంచాయితీ' తెగిందా..!
By
Vaasthava Nestham
- గత నాలుగు సంవత్సరాల నుండి అక్రమంగా పసిడి కొనుగోలు వ్యాపారం
- గుట్టు చప్పుడు జరిగిన దందా.. పలు శాఖల అధికారులకు తెలియదా..?
- లేదా పలు శాఖల అధికారులను మేనేజ్ చేశారా..?
- నాలుగు సంవత్సరాల్లో కోట్ల వ్యాపారం..!
- రూ.2 కోట్లు తీసుకుని బంగారం ఇవ్వని మధ్యవర్తి..?
- దీంతో బయటకు పొక్కిన బండారం
- గతంలో ఇక్కడ పనిచేసిన పలు శాఖల అధికారులకు భారీ ముడుపులు..?
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఏ నోట విన్న గత నాలుగు సంవత్సరాల నుండి అక్రమంగా జరిగిన బంగారం కొనుగోలు వ్యాపారం ముచ్చట్లే వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం దీనిపైన చేర్చ జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్'కు చెందిన ఒక వ్యక్తి నియోజకవర్గ కేంద్రంలోని కొంతమంది బడా బాబులతో, మరికొంతమంది వ్యాపారులతో పరిచయాలు ఏర్పరచుకొని గత నాలుగు సంవత్సరాలుగా అక్రమంగా బంగారు వ్యాపారం చేసినట్టు తెలుస్తోంది. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే పలు శాఖల అధికారులకు ఈ అక్రమ బంగారు కొనుగోలు వ్యాపారం తెలియదా..? అని ప్రజల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఏకంగా బహిరంగ మార్కెట్లో దొరికే ధర కంటే తక్కువకు ఎలా..?? విక్రయించారనే చర్చలు నియోజకవర్గ ప్రజల్లో మొదలయ్యాయి. ఇటీవల ఇట్టి విషయంపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఒక యువకుడుని ఆ వ్యాపారులు మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది..? గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన పలు శాఖల అధికారులకు ఈ అక్రమ వ్యాపారం తాలూకు భారీ స్థాయిలో ముడుపులు ముట్టినట్లు చర్చలు సైతం జరుగుతున్నాయి. గత నాలుగు సంవత్సరాల నుండి ఈ వ్యాపారంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి, గత కొన్ని నెలల క్రితం నియోజకవర్గం కేంద్రానికి చెందిన పలు వ్యాపారులనుండి రూ.2 కోట్లు తీసుకెళ్లి నెలలు గడిచినా కూడా బంగారం ఇవ్వకపోవడంతో ఈ వ్యాపారం బయటకు పొక్కింది. ఇంత పెద్ద ఎత్తున గత నాలుగు సంవత్సరాల నుండి జరిగిన బంగారు కొనుగోలు వ్యాపారం బయటకు పడకపోవడంతో ఈ వ్యాపారంలో ఒక శాఖకు చెందిన అధికారి హస్తం ఉందన్నట్లు చర్చలు మొదలయ్యాయి. ఏది ఏమైనా నియోజకవర్గ కేంద్రంలో మాత్రం 'పసిడి పంచాయతీ' పైనే చర్చలు జరుగుతున్నాయి.
Comments