-Advertisement-

పరిమితి మించి వైద్యం.. ఆర్ఎంపీలదే ఇష్టరాజ్యం..!?

Rmp doctor qualification, RMP doctor full form, RMP doctor course, Rmp doctor in india, RMP certificate
Vaasthava Nestham

- ఏజెన్సీ ప్రాంతాల్లో పెట్రేగిపోతున్న ఆర్ఎంపీ వైద్యులు
- వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలకు గండం
- సిరికొండ మండలంలోని ఓ ఆదివాసికి వైద్యం వికటించి కిడ్నీలపై ప్రభావం
- గతంలో ఇచ్చోడ మండలంలో ఘటన 
- తూతూమంత్రంగా అధికారుల తనిఖీలు, చర్యలు 
- మళ్లీ యధావిధిగా ఆర్ఎంపీ వైద్య కేంద్రాల నిర్వహణ
- జిల్లా స్థాయి అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటే ప్రజల ప్రాణాలకు భరోసా


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: పరిమితికి మించి వైద్యం చేయడం, వ్యాధులు నయమైతే ఓకే... లేకుంటే అవస్థతకు గురి అయితే సైలెంట్ గా సైడ్ అవ్వడంలో కొందరు ఆర్ఎంపీ వైద్యులు రాటు దేలారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా తమకు అచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో కొందరు ఆర్ఎంపీ వైద్యులు చెలగాటమాడుతున్నారు. ఆర్ఎంపీ వైద్యులు పరిమితికి మించి చేసిన వైద్యంతో ప్రజలు అవాస్తతకు గురై చనిపోయిన, ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఇచ్చోడ మండలంలోని బోరిగం గ్రామానికి చెందిన ఓ మహిళ, ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ వైద్యుని వద్ద చికిత్స తీసుకొని వైద్యం వికటించి మరణించిన ఘటన మరువకముందే సిరికొండ మండలంలో మరొక ఘటన వెలుగు చూసింది.


వైద్యం వికటించి కిడ్నీలపై ప్రభావం...

సిరికొండ మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన ఓ గిరిజనుడు కడుపు నొప్పి భరించలేక సిరికొండలోని ఓ ఆర్ఎంపీ వైద్యుని వద్దకు చికిత్స కోసం వెళ్ళగా వ్యాధి ఏంటో ఆర్ఎంపీ డాక్టర్ ఏమాత్రం తెలియనప్పటికీ పరిమితికి మించి వైద్యం చేయడంతో ఆ గిరిజనుడు తీవ్ర అవస్థకు గురయ్యాడు. దీంతో ఆ గిరిజనుడు పట్టణ ప్రాంతంలోని ప్రముఖ వైద్యుని వద్దకు పరీక్షల కోసం వెళ్ళాడు. దీంతో ఆ వైద్యుడు వైద్య పరీక్షలు నిర్వహించి మోతాదుకు మించి, హాని కరమైన, రోగంతో సంబంధం లేని ఇంజక్షన్లు వేయడం వల్ల కిడ్నీల పై ప్రభావం పడిందని చెప్పడంతో ఆ గిరిజనులు ఆందోళన చెందుతూ.. కుల పెద్దలకు జరిగిన విషయం చెప్పాడు. దీంతో కుల పెద్దలు ఆ గిరిజనునికి వైద్యానికి అయ్యే ఖర్చు అంతా భరిస్తానని ఆ సదరు ఆర్.ఎం.పి ఒప్పుకున్నాడు. ఆ రోగికి మళ్ళీ కడుపు నొప్పి రావడంతో మరో సారి ఆ ఆర్ఏంపీ వద్దకు వెళ్లగా నేను వైద్యం చేయించనని ఏమి చేస్తావో చేసుకో అంటూ బెదిరించినట్లు ఆ గిరిజనుడు తెలిపాడు. దీంతో ఆ గిరిజనుడు ఏమి చేయలేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గతంలో సైతం ఇచ్చోడ మండల కేంద్రంలో ఇలాంటి ఘటన వెలుగు చూపడంతో ఆ సదరు ఆర్ఎంపీ డాక్టర్ తన ఆర్ఎంపి వైద్య కేంద్రాన్ని మూసేసి పరారైనట్లు తెలిసింది. దీనిపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టగా మళ్లీ ఆ ఆర్ఎంపి వైద్యుడు యధావిధిగా తన ఆర్ఎంపి వైద్య కేంద్రాన్ని కొనసాగిస్తున్నాడు.


పోలీస్ స్టేషన్'లో ఫిర్యాదు... ఆర్ఎంపీ'కి రూ.40 వేల జరిమానా..

బాధిత గిరిజనుడు ఆర్ఎంపీ పై సిరికొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆ స్టేషన్ ఎస్సై ఘటనను తనసర్కిల్ పరిధిలోని ఇచ్చోడ సీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఆ.. ఆర్ఎంపీ కి రూ.40 వేల జరిమానా విధించి బాధితునికి ఇవ్వాలని, ఒక స్టాంపు పేపర్ రాయించుకొని రూ.40 వేలు అందజేసినట్లు సమాచారం. ఈ విధంగా మారు మూల గ్రామీణ ప్రాంతాలలో వైద్యం విక టించడంతో పంచాయతీలతో ఆర్ఎంపీలు సరిపెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటే గిరిజనుల ప్రాణాలకు భరోసా నిలుస్తుందని గిరి గ్రామాల్లో చర్చలు జరుగుతున్నాయి.
Comments
 -Advertisement-