-Advertisement-

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి

Sarpanch election date 2024, Sarpanch elections in Telangana 2024, Sarpanch elections in AP 2024, Gram Panchayat Election 2024
Vaasthava Nestham

- నాలుగైదు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి
- మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు 
- గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు
- చివరగా మునిసిపల్ ఎన్నికలు 
- జిల్లా అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: నాలుగైదు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందని, స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నతం కావాలని గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్' లో జిల్లా అధికారులకు సూచించారు. మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతాయని, గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు ఉంటాయని చివరగా మునిసిపల్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఆయన వీడియో కాన్ఫరెన్స్'లో సూచించారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్'లో జిల్లా కలెక్టర్ రాజార్షి షా తో పాటు వివిధ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా వెల్లడించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జడ్పీసీఈఓలు, డీపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. సెప్టెంబర్ 6న ఓటరు జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరించి అభ్యంతరాలు స్వీకరించాలని, సెప్టెంబర్ 21న తుది ఓటరు జాబితాను వెలువరించాల్సి ఉంటుందన్నారు. తుది ఓటరు జాబితాను వెలువరించడానికి ముందే క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, ఏవైనా మార్పులు, చేర్పులకు సంబంధించిన అభ్యర్థనలు వస్తే వాటిని పరిశీలించి ఓటరు జాబితాలో చేర్చే అధికారం కేవలం ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.దీనికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పందిస్తూ..పంచాయతీ రాజ్ చట్టం-2018 తో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలపై పూర్తి అవగాహన ఏర్పరచుకొని, ఎన్నికల నిర్వహణ ప్రక్రియ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు క్రియాశీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉన్న ఓటరు జాబితాను గ్రామ పంచాయతీల వారీగా రూపొందించుకొని, అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి గల్లంతు కాకుండా జాగ్రత్తలు తీసుకుటామని వివరించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, జడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, డీపీఓ శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-