-Advertisement-

ఇచ్చోడ ఎస్సైగా తిరుపతి బాధ్యతలు స్వీకరణ

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: మండల నూతన ఎస్సైగా తిరుపతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ను ఆయన మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేశారు. గతంలో ఆయన నిర్మల్ జిల్లాలోని ముధోల్, జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్, జగిత్యాల్ పట్టణ ఎస్సై గా విధులను నిర్వహించారు. ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. గతంలో ఎస్సై తిరుపతి ఆర్మీలో సైతం విధులు నిర్వహించారు. ఇటీవల ఇచ్చోడ మండల ఎస్సైగా పనిచేసిన నరేష్ విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినందుకు ఎస్పీ ఆఫీసుకు అటాచ్ అయిన విషయం విధితమే.
Comments
 -Advertisement-