Polygraph Test: అసలేంటీ పాలీ గ్రాఫ్ టెస్ట్...
By
Vaasthava Nestham
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెను సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనలో సీబీఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కోర్టు ఆదేశాలతో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సహా మరో ఆరుగురికి పాలీగ్రాఫ్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో అతడ్ని జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే జైలులోనే ఈ పాలీగ్రాఫ్ టెస్ట్‌ను సీబీఐ అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు.. సంజయ్ రాయ్‌తోపాటు మరో ఐదుగురికి కూడా ఈ కేసులో పాలిగ్రాఫ్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నారు.
అసలేంటీ పాలీగ్రాఫ్ టెస్ట్ లేదా లై డిటెక్టర్..Polygraph, Lie Detector
పాలీగ్రాఫ్ టెస్ట్ అన్నా.. లై డిటెక్టర్ అన్నా ఒకటే.. Polygraph, Lie Detector ఏదైనా కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు విచారణలో దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు నిజాలు చెబుతున్నారా లేక అబద్ధాలు చెబుతున్నారా అనే విషయాన్ని ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు. అయితే ఈ లై డిటెక్టర్‌లో ఎలాంటి మెడిసిన్ గానీ.. మత్తు మందులను గానీ ఉపయోగించరు. కేవలం ఆ నిందితుల శరీరానికి కార్డియో కఫ్‌లు లేదా తేలికపాటి ఎలక్ట్రోడ్‌లతోపాటు ఇతర పరికరాలు మాత్రమే అమర్చుతారు. వాటి ఆధారంగా ఆ వ్యక్తి బీపీ, శ్వాసక్రియ రేటును పర్యవేక్షిస్తారు. దర్యాప్తు అధికారులు ప్రశ్నలు అడిగినపుడు నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో అతని శరీరం ఎలా స్పందిస్తుందో వీటివల్ల తెలుసుకునేందుకు పరికరాలు ఉంటాయి. అయితే ఒకవేళ నిందితుడు అబద్ధం చెప్తే.. ఆ సమయంలో అతడి శరీరంలో మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా బీపీ, శ్వాసక్రియ రేటులో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి. దీని వల్ల నిందితుడు చెప్పేది నిజమా.. కాదా అని వాటికిచ్చిన నంబర్ ఆధారంగా దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ నిపులు గ్రహిస్తారు. అయితే ఇందులో వ్యక్తి వాస్తవాలను దాచేందుకు ఆస్కారం ఉంటుందని కొందరు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పాలిగ్రాఫ్ టెస్ట్‌ను 19వ శతాబ్దంలో ఓ ఇటలీ క్రిమినాలజిస్ట్ తొలిసారి వినియోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Comments