-Advertisement-

జాతీయ రహదారిపై మృత్యు ఘోష

Vaasthava Nestham

- రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి 
- మృతి చెందిన ముగ్గురు ఇచ్చోడ వాసులే 
- తండ్రితో పాటు ఇద్దరు కుమారులు మృతి 


వాస్తవ నేస్తం,ఆదిలాబాద: శుభకార్యానికి వెళ్లి, ఇంటికి తిరిగి వెళుతున్న ఆ కుటుంబాన్ని మృత్యు రోడ్డు ప్రమాద రూపంలో కబలించింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో రోదనాలు వెన్నంటాయి. ఇచ్చోడ మండల కేంద్రంలోని బార్కత్ పూర కాలనీకి చెందిన జహేద్ జిల్లా కేంద్రంలో ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాల సభ్యులతో కలిసి టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు.మంగళవారం నిర్మల్ జిల్లా భైంసా లో ఒక శుభకార్యంలో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో గుడిహత్నూర్ మండలం సీత గొంది మేకల గండి వద్ద 44వ జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి సైడ్ పిల్లర్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ప్రమాదంలో ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన జహేద్, ఇద్దరు కుమారులు మృతి చెందాలు. జహేద్ తో పాటు అతని మామయ్య, వేరొక బాలుడు మృతి చెందాడు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే మండల కేంద్రంలోని ప్రజలు పెద్ద ఎత్తున రిమ్స్ కు తరలి వెళ్లారు. తండ్రి, ఇద్దరు కుమారులు మృతి చెందిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. జహేద్ గతంలో హైదరాబాద్ లో ఉంటూ, రిలయన్స్ లో ఇంజనీరుగా విధులు నిర్వహించారు. లాక్ డౌన్ అనంతరం జిల్లా కేంద్రానికి వచ్చి ఎలక్ట్రిక్ షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రమాద వార్త విన్న ఇచ్చోడ బార్కత్ పూర వాసులు భారీ ఎత్తున రిమ్స్ కు వెళ్లారు. తీవ్రంగా గాయపడిన వారిలో జహేద్, మరొక్క కుమారుడు, కూతురు ఉన్నారు.


Comments
 -Advertisement-