-Advertisement-

మురికి నీరే వారికి దిక్కు..!

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ప్రతిరోజు గ్రామాలలో పరిశుభ్రత పనులతో పాటు గ్రామాలలో వాటర్ ట్యాంకులను ఎప్పటికీ అప్పుడు శుభ్రపరుస్తూ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవలసిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంతో ఆదిలాబాద్ భీంపూర్ మండలం నిపాని గ్రామంలో వాటర్ ట్యాంక్ ద్వారా వచ్చే అపరిశుభ్రమైన నీరే తాగడానికి దిక్కుగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. నిపాని గ్రామంలోని వాటర్ ట్యాంక్ ను అధికారులు శుభ్రపరిచేదా చర్యలు తీసుకోకపోవడంతో నల్లాల నుండి మురికి నీరు వస్తుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు తెలియజేసిన కూడా అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఈ మురికి నీరు తాగితే వ్యాధులతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వాటర్ ట్యాంక్ శుభ్రపరిచేలా చర్యలు తీసుకొని గ్రామ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 




Comments
 -Advertisement-