-Advertisement-

మైనర్ బాలికపై సీఐ అత్యాచారయత్నం

Vaasthava Nestham

- సీఐపై ఫోక్సో కేసు నమోదు
- వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఘటన 
- పరారీలో సీఐ


వాస్తవ నేస్తం,హన్మకొండ: సమాజంలో పోలీసుల మంచి గౌరవం ఉంది. కాని కొందరు పోలీసులు చేసే చేష్టలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. బాధితులకు న్యాయం చేయవలసిన కొందరు ఖాకిలే కామంతో కళ్ళు మూసుకుపోయి అగైత్యాలకు పాలు పడుతున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాజీపేట సీఐ రవికుమార్ ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశారు.ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బుధవారం లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇంటికి రాగానే తల్లిదండ్రులకు బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో హుటాహుటిన వెళ్లి కాజీపేట పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐపై లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో సీఐ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమాజంలో అత్యాచార ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే దారుణాలకు పాల్పడటం ఏంటని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, స్థానిక రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments
 -Advertisement-