-Advertisement-

Ratan Tata : రతన్ టాటా యాదిలో...!!

about Ratan Tata, Ratan Tata, Ratan Tata business, Ratan Tata education, Ratan Tata life history, Ratan Tata story
Vaasthava Nestham
టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (The Tata Group ) జమ్‌షెడ్జీ టాటా(జమ్‌షెడ్జీ నుసర్వాన్జీ టాటా) భారతీయ పరిశ్రమ పితామహుడు చే 1868 సంవత్సర లో స్థాపించబడిన భారతదేశం లోని పూర్వ కంపెనీ లలో ఒకటి.
 
ఈ సంస్థను ఆరు ఖండాలలో 100కు పైగా దేశాల్లో 2,46,000 మంది ఉద్యోగులతో కంపెనీ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీస్ కు రెండు మిలియన్లకు పైగా వాటాదారులు, సుమారు విలువ $ 57.7 బిలియన్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నాయి. ముంబైలో ప్రధాన కార్యాలయం ఉన్న టాటా గ్రూప్ రసాయనాలు , వినియోగ దారుల ఉత్పత్తులు , ఎనర్జీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సర్వీసెస్ మొదలైన వాటితో సహా అనేక ప్రాథమిక వ్యాపార రంగాలను నిర్వహిస్తోంది.

1868లో జంషెడ్జీ టాటా స్థాపించిన ఈ సంస్థ అనేక అంతర్జాతీయ కంపెనీలను కొనుగోలు చేసిన తరువాత అంతర్జాతీయ గుర్తింపును పొందింది. ప్రతి ఒక్క టాటా కంపెనీ దాని స్వంత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల, వాటాదారుల మార్గదర్శకత్వం, పర్యవేక్షణలో స్వతంత్రంగా పనిచేస్థాయి. టాటా గ్రూప్ స్థాపకుడిగా గుర్తింపు పొందిన జంషెట్జీ టాటాను కొన్నిసార్లు 'భారతీయ పరిశ్రమ పితామహుడు' గా భావిస్తారు. 

• గ్రూప్ అభివృద్ధి....

జంషెట్జీ టాటా 1868 లో టాటా గ్రూపును ఒక ప్రైవేట్ ట్రేడింగ్ సంస్థగా స్థాపించారు.1902 సంవత్సరంలో, ఈ బృందం తాజ్ మహల్ ప్యాలెస్ & టవర్ ను ముంబై లో ప్రారంభించడానికి ఇండియన్ హోటల్స్ కంపెనీని ఏర్పాటు చేసింది, ఈ హోటల్ దేశంలో మొట్టమొదటి లగ్జరీ హోటల్. 1904లో జంషెట్జీ టాటా మరణించగా, ఆయన కుమారుడు సర్ దొరబ్ టాటా కంపెనీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి, అతని నాయకత్వంలో, ఈ సమూహం వేగంగా పురోగమించి, ఉక్కు (1907), విద్యుత్ (1910), విద్య (1911), వినియోగ వస్తువులు (1917), విమానయానం (1932) వంటి వివిధ పరిశ్రమ విభాగాల్లోకి ప్రవేశించింది.1932లో దొరబ్ మరణం, సర్ నౌరోజీ సక్లత్ వాలా పదవి భాద్యతలు, ఆరేళ్ల తర్వాత జహంగీర్ రతన్ జీ దాదాభాయ్ టాటా గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాడు. అతని నాయకత్వం లో రసాయనాల పరిశ్రమ (1939), కాస్మోటిక్స్ పరిశ్రమ (1952), మార్కెటింగ్, ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ (1954), తేయాకు పరిశ్రమ (1962) సాఫ్ట్ వేర్ సర్వీసెస్ (1968)లతో సహా అనేక కొత్త పారిశ్రామిక రంగాలపై కంపెనీ తన విస్తరణను చేపట్టడం జరిగింది. 1945 సంవత్సరంలో, టాటా గ్రూప్ టాటా ఇంజనీరింగ్, లోకోమోటివ్ కంపెనీని స్థాపించడం(, దీనిని 2003 సంవత్సరంలో టాటా మోటార్స్ గా పేరు మార్చారు). ఈ సంస్థ ఇంజనీరింగ్, లోకోమోటివ్ ఉత్పత్తులను చేస్తుంది. 1991లో జహంగీర్ రతన్ జీ దాదాభాయ్ టాటా (జె.ఆర్.డి.టాటా) తరువాత ఆయన మేనల్లుడు రతన్ టాటా బాధ్యతలు స్వీకరించాడు. అతడు వ్యాపారాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టి, ఈ గ్రూప్ 2000 సంవత్సరంలో లో లండన్ కు చెందిన టెట్లీ టీని కొనుగోలు, 2004 సంవత్సరం లో దక్షిణ కొరియాకు చెందిన డేవూ మోటార్స్ ట్రక్కు తయారీ కార్యకలాపాలను కొనుగోలు, 2001లో టాటా-ఎఐజి అనే బీమా కంపెనీని స్థాపించడానికి , ఈ గ్రూపు అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్, తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

• 2007- 2022 ఈ మధ్యకాలంలో విశేష మైన ప్రగతి 

ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమలో, టాటా గ్రూప్ వ్యూహాత్మక సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టిఎఎస్ఎల్), 2007 లో స్థాపించబడింది, ఇది రక్షణ రంగములో దేశీయ అభివృద్ధి, కీలకమైన ఏరోస్పేస్, రక్షణ పరిష్కారాల తయారీని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వమునకు సహకారం అందిస్తుంది. మౌలిక సదుపాయాల పరిశ్రమలో, టాటా గ్రూప్ భారతదేశం అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ టాటా పవర్ ను కలిగి ఉంది, అంతేకాకుండా ఈ పోర్ట్ ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి టాటా హౌసింగ్, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్, టాటా ప్రాజెక్ట్స్ , టాటా రియాల్టీ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లను కలిగి ఉంది. రిటైల్, కన్స్యూమర్ పరిశ్రమలలో టాటా గ్రూపుకు టాటా కెమికల్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, వోల్టాస్, ట్రెంట్ , ఇన్ఫినిటీ రిటైల్ ఉన్నాయి, ఇది విభిన్న రకాల ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది. టెలికాం, మీడియా పరిశ్రమలో, టాటా గ్రూప్ టాటా కమ్యూనికేషన్స్, టాటా ప్లే , టాటా టెలిసర్వీసెస్ ద్వారా తన వ్యాపారాలను విస్తరించింది.

2007లో టాటా గ్రూప్ ఆంగ్లో-డచ్ ఉక్కు తయారీ సంస్థ కోరస్ గ్రూప్ ను కొనుగోలు చేసి, ఒక భారతీయ కంపెనీ అతిపెద్ద కార్పొరేట్ టేకోవర్ ను పూర్తి చేసింది. తర్వాత ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రవేశించి. జనవరి 10, 2008న, టాటా మోటార్స్ నానో, వాహన తయారీని ప్రారంభించి, జూలై 2009లో, మొదటి నానో భారతదేశంలో మార్కెట్ లోనికి వచ్చింది. టాటా మోటార్స్ 2008 సంవత్సరం లో ఫోర్డ్ మోటార్ కంపెనీ నుండి ఎలైట్ బ్రిటిష్ బ్రాండ్స్ జాగ్వార్- ల్యాండ్ రోవర్ ను కొనుగోలు చేసింది. నాలుగు సంవత్సరాల తరువాత రతన్ టాటా పదవీ విరమణ చేసి సైరస్ మిస్త్రీ తరువాత చైర్మన్ కావడం, వ్యాపార వ్యూహానికి సంబంధించి టాటా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మిస్త్రీని 2016 అక్టోబర్ లో చైర్మన్ పదవి నుంచి అకస్మాత్తుగా తొలగించి, రతన్ టాటా తాత్కాలిక చైర్మన్ స్థానానికి తిరిగి వచ్చాడు . నటరాజన్ చంద్రశేఖరన్ ను ఈ పదవిలో నియమించడంతో రతన్ చైర్మన్ గా రెండోసారి 2017 సంవత్సరంలో జనవరిలో ముగిసింది.

సెప్టెంబర్ 2017 సంవత్సరంలో లో టాటా గ్రూప్ తన యూరోపియన్ ఉక్కు తయారీ కార్యకలాపాలను జర్మన్ ఉక్కు తయారీ సంస్థ థైస్సెన్ క్రుప్ తో విలీనం చేసే ప్రణాళికలను ప్రకటించింది. 2022లో టాటా గ్రూప్ 1932లో టాటా కుటుంబం స్థాపించిన ఎయిర్ ఇండియా కొనుగోలు చేసింది. 

సేకరణ: mohammad Gouse
     
Comments
 -Advertisement-