తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫాం స్కామ్... 80 నుంచి 100 కోట్లు హంపట్ ..!?
By
Vaasthava Nestham
- ఆందోళన చెందుతున్న బాధితులు
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: గాడిదల ఫాం ఏర్పాటు చేస్తే కోట్లు వస్తాయని నమ్మించారు. ఒక్కొక్కరు 60 లక్షల నుంచి 90 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. తీరా గాడిద పాలు సంబంధిత వ్యక్తులు కొనక పోవడంతో గాడిద ఫాం లు ఏర్పాటు చేసిన బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడు తిరువన్ వేలికి చెందిన కొంతమంది గాడిదల ఫాం బిజినెస్'కు తెరలేపారు.మొదట్లో గాడిద ఫామ్ నిర్వాహకుల నుండి గాడిద పాలు కొనుగోలు చేశారు. తరువాత గాడిద పాలు కొనుగోలు చేయకుండా, అదేవిధంగా కొనుగోలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాము నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 80 నుంచి 100 కోట్ల స్కాం జరిగినట్లు తెలుస్తోంది. గాడిద పాలు కొనుగోలు చేసిన సదరు కంపెనీలు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. దీంతో గాడిద ఫామ్ ఏర్పాటుచేసిన నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
Comments