-Advertisement-

ACB Ride : మళ్ళీ నిర్మల్'లో ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

Vaasthava Nestham

- లంచాలు తీసుకుంటూ వరుసగా ఏసీబీకి చిక్కుతున్న అవినీతిపరులు
- ఏసీబీ వలలో లాండ్ అండ్ సర్వే ఉద్యోగులు


వాస్తవ నేస్తం,నిర్మల్: లంచాలు తీసుకుంటూ అధికారులు వరుసగా ఏసీబీకి చిక్కుతున్నారు. లంచావుతారులకు కేరాఫ్ గా నిర్మల్ జిల్లా నిలుస్తోంది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి లో ఉన్న ల్యాండ్ అండ్ సర్వే కార్యాలయంలో శుక్రవారం ఏసీబీకి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూనియర్ అసిస్టెంట్ జగదీష్, అటెండర్ ప్రశాంత్ లు పట్టుబడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ పట్టణంలోని బుధవార్ పేటకు చెందిన సల్ల హరీష్ తమ భూమికి సంబంధించి సేత్వార్ కోసం కార్యాలయానికి వచ్చాడు. ఐతే సేత్వార్ ఇచ్చేందుకు జూనియర్ అసిస్టెంట్ జగదీష్ రూ.10 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో రూ. 10 వేలు రూపాయలు జగదీష్, అటెండర్ ప్రశాంత్ లు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయంలోనే ఉన్న ఈ ఉద్యోగి లంచం డిమాండ్ చేయడం, ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది.


నిర్మల్ జిల్లాలో గతంలో ఏసీబీకి పట్టుబడిన లంచావుతారులు


• ఇటీవలే నిర్మల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న షాకీర్ ఖాన్ అదే కార్యాలయంలోని ఉద్యోగి వద్ద నుండి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డాడు. 
• గతంలో మునిసిపల్ లో మేనేజర్ గా పనిచేస్తున్న గంగాధర్ కూడా ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు.
• అంతకుముందు కార్మిక శాఖ అధికారిగా పనిచేస్తున్న సాయిబాబా, తన కుమారుడితో సహా ఏసీబీ దాడుల్లో దొరికారు. 
• అంతకుముందు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, తాత్కాలిక ఉద్యోగి పట్టుబడ్డారు.
Comments
 -Advertisement-