సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తప్పవు: జిల్లా పాలనాధికారి రాజర్షి షా
By
Vaasthava Nestham
- సర్వేలో నిర్లక్ష్యం వహించిన ఎంపీడీవో, అగ్రికల్చరల్ ఆఫీసర్, పంచాయితీ సెక్రటరీ లకు షోకాజ్ నోటీసులు జారీ
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తప్పవని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అధికారులను హెచ్చరించారు. ఇచ్చోడ మండలంలోని గేర్జం, ముఖార(కే) గ్రామాలలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తీరును జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. మండలంలోని గేర్జం గ్రామంలో ఇళ్ల జాబితా సర్వే సరిగా నిర్వహించకపోవడంతో, అదేవిధంగా స్టిక్కర్ల పై సరైన వివరాలు నమోదు చేయకపోవడం, సర్వేకు సంబంధించి మ్యాప్ ద్వారా ఎక్కడి నుండి ఎక్కడి వరకు సర్వే నిర్వహించాలో ముందుగా నిర్దారించక పోవడం, సర్వేలో ఆన్ని తప్పులు నమోదు చేయడంతో ఇచ్చోడ ఎంపీడీవో లక్ష్మణ్, ఏవో కైలాస్, పంచాయితీ సెక్రటరీ సయ్యద్ ఏజాజ్ హస్మి లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత కొద్ది రోజులనుండి సమగ్ర ఇంటింటి ఇళ్ళ జాబితా, పూర్తి సర్వే పై శిక్షణలు, సమావేశాలు, గూగుల్ మీట్, టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పూర్తి అవగాహన దిశా నిర్దేశం చేసినప్పటికీ విధులు సక్రమంగా నిర్వహించకపోవడం తో విధులలో నిర్లక్ష్యం వహించినందున వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఎలాంటి తప్పులు జరగకుండా సర్వే నిర్వహించాలని అన్నారు. కలెక్టర్ వెంట సీఈఓ జితేందర్ రెడ్డి, తహశీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
Comments