నత్త నడకన రోడ్డు పనులు.. ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు
By
Vaasthava Nestham
- ఏడాది గడుస్తున్న పూర్తికాని రోడ్డు పనులు
- తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యలు
- రోడ్డు పై తరచుగా మురారిస్తున్న వాహనాలు
- ప్రమాదాలకు గురవుతున్న ద్విచక్ర వాహనదారులు
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- ట్రాఫిక్ నియంత్రణ పట్టించుకుని అధికారులు
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. రోడ్డు పనులు ప్రారంభమై ఏడాది గడుస్తున్న కూడా పనులు పూర్తి అవ్వకపోవడంతో వాహనదారులు, మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా రోడ్డు పనులు సాగడంతో తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఒకపక్క కంకర వేసి వదిలివేయడంతో కంకర పై నుండి వాహనాలు వెళుతూ మొరాయిస్తున్నాయి. ఏడాది గడుస్తున్న కూడా రోడ్డు పనులు పూర్తి అవ్వకపోవడంతో నూతన రోడ్డు నిర్మితమవుతుందా.? లేదా పనులు అర్ధాంతరంగా ఆగిపోతాయా..? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నం అవుతున్నాయి.
ట్రాఫిక్ నియంత్రణలో అధికారుల పట్టింపు ఎక్కడ..?
రోడ్డు పనులు పూర్తి అవ్వకపోవడం, రోజురోజుకు జనసాంద్రత పెరగడంతో మండల కేంద్రంలో ట్రాఫిక్ అస్తవ్యస్తమయింది. ఒకేసారి వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు, విద్యార్థులు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణను అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments